రాష్ట్రంలో నిదానంగా నేతల జంపిగులు జరిగేలా ఉన్నాయి..అయితే అధికార వైసీపీలోకి ప్రతిపక్ష టీడీపీ నేతలు జంప్ చేయడం కాదు..టీడీపీలోకే వైసీపీ నేతలు జంప్ చేయడం. ఏదో స్థానిక ఎన్నికల సమయం వరకు వైసీపీలోకి టిడిపి నేతల జంపింగులు జరిగాయి. ఆ తర్వాత నుంచి వైసీపీ వైపు చూసే నేతలు లేకుండా పోయారు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉన్నా సరే వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయడానికి రెడీ అయ్యారనే విషయం తెలిసిందే. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డిలు వైసీపీని వీడారు. వీరు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఇంకా కొన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.


మొత్తం 12 సీట్లు ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ 4 సీట్లు గెలుచుకున్నాయి. అందులో చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ బలం 9కు చేరుకుంది. అయితే ఇపుడు సీన్ రివర్స్ అయిందని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

వైసీపీలో వారికి సీట్లు దక్కే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయని, ఆ ఎమ్మేల్యేలు వైసీపీని వీడటానికి రెడీగా ఉన్నారని సమాచారం. అంతర్గతంగా ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనే అంశం కూడా బయటకొస్తుంది. కాకపోతే అధికారికంగా మాత్రం బయటపెట్టడం లేదు. చూడాలి మరి ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ ఇచ్చేది ఎవరో.
