గత రెండు ఎన్నికలుగా వైసీపీ ఆధిక్యం సాధిస్తున్న ప్రకాశం జిల్లాలో ఈ సారి సీన్ మారేలా ఉంది. ఇప్పటివరకు తిరుగులేని ఆధిక్యంలో కనబరుస్తున్న వైసీపీకి ఈ సారి చుక్కలు కనబడేలా ఉన్నాయి. ఈ రెండున్నర ఏళ్లలోనే ప్రకాశం రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి. అధికారంలో ఉండటం వల్ల పైకి వైసీపీ బలం ఉన్నట్లు కనిపిస్తుంది గానీ. లోపల మాత్రం వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీకి సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

పైగా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వేగంగా పుంజుకుంటుంది. టీడీపీ నేతలు గట్టిగా కష్టపడుతూ పార్టీని పైకి లేపుతున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నారు. ముఖ్యంగా దర్శిలో టీడీపీ ఏ స్థాయిలో పుంజుకుందో చెప్పాల్సిన పని లేదు. వైసీపీలో బడా బడా నేతలు ఉన్నా సరే దర్శి మున్సిపాలిటీలో టీడీపీ గెలిచింది. అంటే ఇక్కడ టీడీపీకి ఎంత ప్లస్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ టీడీపీ నేత పమిడి రమేష్ అనూహ్యంగా పుంజుకున్నారు.

అటు కనిగిరిలో సీనియర్ నేత ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సైతం పికప్ అయ్యారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌పై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ముక్కు నిత్యం ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. దీంతో కనిగిరిలో టీడీపీ చాలావరకు పికప్ అయింది. అలాగే భారీ మెజారిటీతో గెలిచిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిస్తితి కూడా సరిగ్గా లేదు.

ఇప్పటికే నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు…వరుసపెట్టి టీడీపీలో చేరిపోతున్నారు. టీడీపీ నేత అశోక్ రెడ్డి…వైసీపీ శ్రేణులని చేర్చుకుని టీడీపీని స్ట్రాంగ్ చేస్తున్నారు. ఇటు వస్తే సంతనూతలపాడులో కూడా ఎమ్మెల్యే సుధాకర్‌కు వ్యతిరేకత ఉంది. ఈ రెండున్నర ఏళ్లలో సుధాకర్ పనితీరు పెద్దగా మార్కులు పడటం లేదు. ఇక్కడ టీడీపీ నేత విజయ్ కుమార్ సత్తా చాటుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఈ సారి టీడీపీ నేతలు సత్తా చాటేలా ఉన్నారు.

Discussion about this post