రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించిందని కంటే ఎక్కువ వేగంగానే మారుతున్నాయి. ఈ సారి మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి తప్పనిసరిగా అధికారంలోకి రావాలని టీడీపీ..ఈ సారి అధికారం పంచుకోవాలని చెప్పి జనసేన గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా రాజకీయం నడిపిస్తున్నారు. ఈ రాజకీయంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ప్రజలు డిసైడ్ చేస్తారు.

కానీ ప్రస్తుతం రాజకీయాలని బట్టి చూస్తే కొంతవరకు వైసీపీపై అసంతృప్తితోనే ప్రజలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత వరకు ఉందనేది అదే ప్రజలని అడిగితే బెటర్ అని చెప్పవచ్చు. కాకపోతే ప్రజలు పూర్తిగా వైసీపీపై అసంతృప్తి అని మాత్రం బయటకు చెప్పడం లేదు. కారణాలు ఏమైనా గాని కాస్త వైసీపీకి భయపడి ఎవరు బయటపడటం లేదు. కానీ కొన్ని సర్వేల్లో పలు అంశాలు తేటతెల్లమవుతున్నాయి. చాలావరకు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది.

అదే సమయంలో టీడీపీ అనుకున్న మేర బలం పుంజుకోవడంలో విఫలమవుతుంది. ఇందులో కూడా నిజం ఉందని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ నేత ఉంటున్నారు. కాకపోతే కొద్దో గొప్పో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలని చూస్తే..అక్కడ వైసీపీకి పెద్దగా అనుకూల వాతావరణం కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. టీడీపీ నుంచి గెలిచిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసీపీలోకి వెళ్లారు. దీంతో వైసీపీ బలం 9కు చేరుకుంది.

ఈ 9మంది ఎమ్మెల్యీల్లో దాదాపు 5గురుపై వ్యతిరేకత ఉందని వైసీపీ అంతర్గత సర్వేల్లోనే బయటపడిందట. అటు టీడీపీకి ఉన్న 3 సీట్లలో ఆ పార్టీ బలంగానే ఉంది. అంటే జిల్లాలో టీడీపీకి ఆధిక్యం పెరిగేలా ఉంది.

Leave feedback about this