ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ హవా కాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. కాస్త రెడ్డి సామాజికవర్గ ప్రభావిత నియోజకవర్గాలు ఉండటంతో..వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. అయితే కొన్ని స్థానాల్లో కమ్మ వర్గం ప్రభావం ఉంది..దీంతో టిడిపి కూడా సత్తా చాటుతుంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో 12 సీట్లు ఉంటే వైసీపీ 6 సీట్లు గెలుచుకుంటే, టిడిపి 5 సీట్లు గెలుచుకుంది. ఒక సీటు ఇండిపెండెంట్ గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో ప్రకాశంలో టిడిపి పరువు నిలబడిందని చెప్పాలి. అన్నీ జిల్లాల్లో చిత్తుగా ఓడితే..ప్రకాశంలో 4 సీట్లు గెలుచుకుంది. ఇంకా వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. అయితే టిడిపి నుంచి గెలిచిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. దీంతో టిడిపి బలం 3 సీట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు అక్కడ టిడిపి బలపడుతూ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటం, టిడిపి బలపడుతున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

ఈ సారి జిల్లాలో 8 సీట్లపైనే గెలుచుకోవాలని టిడిపి చూస్తుంది. అయితే ప్రస్తుతం జిల్లాలో టిడిపికి అనుకూల అవకాశాలు ఉన్నాయి. ఎలాగో టిడిపి సిట్టింగ్ సీటులైన అద్దంకి, పర్చూరు, కొండపిల్లో టిడిపి స్ట్రాంగ్ గా ఉంది. ఇక వైసీపీ చేతుల్లో ఉన్న సీట్లలో టిడిపి పికప్ అయింది దర్శిలో ఇక్కడ టిడిపి బలపడింది. అటు కనిగిరిలో కూడా టిడిపి లీడ్ లోకి వస్తుంది. ఇక బలమైన నాయకుడుని బట్టి చీరాలలో కూడా సత్తా చాటవచ్చు.

అటు సంతనూతలపాడులో కూడా టిడిపి గెలవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యర్రగొండపాలెం, కందుకూరు, మార్కాపురం సీట్లలో టిడిపి గెలుపుకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. గిద్దలూరులో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇక ఒంగోలులో పార్టీ పికప్ అయింది. మొత్తానికి జిల్లాలో 8 సీట్లు గెలవాలని టిడిపి చూస్తుంది.
