గత ఎన్నికల్లో గెలుపు దగ్గర వరకు వచ్చి టిడిపి ఓడిపోయిన సీట్లలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు కూడా ఒకటి. వైసీపీ వేవ్ లో కూడా ఇక్కడ టిడిపి గట్టిగా పోరాడింది. కేవలం 4,666 ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది. టిడిపి నుంచి వరుపుల రాజా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పుడు జనసేన కాస్త ఓట్లు చీల్చడం వల్లే ఆ పరిస్తితి వచ్చింది.
2019 ఎన్నికల్లో వైసీపీకి 76,574 ఓట్లు పడగా, టిడిపికి 71,908 ఓట్లు పడ్డాయి. జనసేనకు 6,907 ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్ల చీలిక ప్రభావం ఉంది. అయితే ఈ సారి ఓట్ల చీలిక ఉన్నా సరే ప్రత్తిపాడులో టిడిపిదే గెలుపు అని తాజా సర్వేల్లో తేలింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పై వ్యతిరేకత కనిపిస్తుంది..ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఇక్కడ అక్రమాలు కూడా ఎక్కువ ఉన్నాయనే ప్రచారం వస్తుంది. ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద మైనస్.

అయితే మొన్నటివరకు ఇక్కడ టిడిపిని వరుపుల రాజా నడిపించారు. కానీ ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించడం టిడిపికి పెద్ద నష్టమే అని చెప్పాలి. ప్రత్తిపాడులో టిడిపిని గెలుపు దిశగా తీసుకొచ్చిన తర్వాత ఆయన మరణించారు. ఇప్పుడు రాజా ప్లేస్ ని టిడిపి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పకిప్పుడు ప్రత్తిపాడులో టిడిపికి బలమైన నాయకుడు దొరికే పరిస్తితి లేదు. అయితే రాజా చనిపోవడంతో ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరినైనా తీసుకుని సీటు ఇస్తారేమో చూడాలి. అలా జరిగిన ప్రత్తిపాడు సీటుని టిడిపి సులువుగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ప్రత్తిపాడులో టిడిపి నాయకుడు ఎవరో.
