గత రెండు ఎన్నికల్లో వైసీపీ అదృష్టం కొద్ది గెలిచిన నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు ఒకటి అని చెప్పవచ్చు. గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతోనే వైసీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పర్వత పూర్ణచంద్రప్రసాద్ ..టీడీపీ నుంచి వరుపుల రాజా పోటీ చేశారు. దాదాపు 5 వేల ఓట్ల తేడాతోనే వైసీపీ గెలిచింది. ఇక్కడ జనసేనకు 7 వేల ఓట్ల వరకు పడ్డాయి.

ఇక తక్కువ ఓట్లతో గెలిచిన బయటపడ్డ ఎమ్మెల్యే పర్వత..అనుకున్న విధంగా పనిచేసి..నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నారు. ఏదో ప్రభుత్వం తరుపున సంక్షేమ పథకాలు మాత్రం వస్తున్నాయి గాని..అభివృద్ధి తక్కువ. ఇటీవల జగన్ వర్క్ షాప్ నిర్వహించి..32 మంది ఎమ్మెల్యేల పరిస్తితి బాగోలేదని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని తెలుస్తోంది. గడపగడపకు వెళ్ళడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.

పైగా ఇక్కడ ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం మండలాలు ఉన్నాయి..వీటిల్లో మూడు మండలాల్లో ఎమ్మెల్యేపై నెగిటివ్ ఉందని తెలుస్తోంది. ఇక్కడ వైసీపీలో వర్గ పోరు నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు…ఎమ్మెల్యే పర్వత వర్గాలకు పడటం లేదు. సీటు కోసం ఇద్దరు నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ ఇటీవల వరుపుల సుబ్బారావుని అనపర్తి నియోజకవర్గ పరిశీలకుడుగా నియమించారు.

దీంతో సుబ్బారావు ఫోకస్ తగ్గుతుందని పర్వత వర్గం భావించింది..కానీ సుబ్బారావు ప్రత్తిపాడుని వదలడం లేదు. ఇలా రెండు వర్గాలు సీటు కోసం పోటీ పడుతున్నాయి. అటు టీడీపీ నుంచి వరుపుల రాజా దూకుడుగా పనిచేస్తున్నారు. పైగా ఇక్కడ జనసేన కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు గాని ఫిక్స్ అయితే డౌటే లేకుండా ఇక్కడ వైసీపీకి గెలుపు అనేది కష్టం.

Leave feedback about this