అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేల గ్రాఫ్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల జగన్ స్వయంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పారు. అయితే ఈ 18 మంది పనితీరు మరీ వరెస్ట్ గా ఉందని తేలింది. ఇక అసలు పనితీరు బాగోని వారు 50 మంది వరకు ఉంటారని తెలిసింది. ఇది అంతర్గతంగా వైసీపీలో జరుగుతున్న చర్చ..వీరికి గెలుపు అవకాశాలు లేవని తెలుస్తుంది.
అదే సమయంలో పనితీరు బాగోని కొందరు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అసలు వారు ఎమ్మెల్యే గాను..అధ్యక్షుడుగాను విఫలమవుతున్నారని తెలిసింది. వీరికి గెలుపు అవకాశాలు ఏ మాత్రం లేవని సర్వేల్లో తేలింది. ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు..అధ్యక్ష పదవి వద్దని చెబుతున్నారట. అయితే 13 మంది ఎమ్మెల్యేలు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు చాలామంది రెండిటోల్లోనూ ఫెయిల్ అవుతున్నట్లు తెలిసింది. అలా ఫెయిల్ అవుతున్న వారిలో పేర్ని నాని ముందు వరుసలో ఉన్నారు. ఈయన మచిలీపట్నం ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు.
అటు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ…అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమె రెండిటిల్లోనూ ఫెయి. అయితే చోడవరం ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీ..ఇటీవలే జగన్ వద్దకు వెళ్ళి అనకాపల్లి అధ్యక్ష పదవి వద్దని చెప్పడంతో..జగన్ తప్పించారు. కాకినాడ జిల్లా-కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్), కోనసీమ-పొన్నాడ సతీశ్‌కుమార్ (ముమ్మిడివరం), తూర్పుగోదావరి-జక్కంపూడి రాజా (రాజానగరం), పశ్చిమగోదావరి-చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట), ఏలూరు- ఆళ్ల నాని (ఏలూరు), ఎన్టీఆర్-వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), శ్రీసత్యసాయి-మాలగుండ్ల శంకరనారాయణ (పెనుకొండ)…వీరంతా ఎమ్మెల్యేగాను..అధ్యక్షుడుగాను ఫెయిల్ అయ్యారని తెలిసింది.
ఇక నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్…శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడుగా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..పల్నాడు జిల్లా, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి…అన్నమయ్య జిల్లా..పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి..నంద్యాల జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. వీరు బాగానే పనిచేస్తున్నారని తేలింది.