అదేంటి.. అనుకుంటున్నారా? వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి.. కడప జిల్లా పులివెందులపై జగన్ పరేషాన్ ఎందుకు? అని బుగ్గలు నొక్కుకుంటున్నారా? ఇక్కడే ఉంది.. అసలు మతలబు. ఎందుకంటే.. పరిస్థితులు మారుతున్నాయి. ప్రజల ఆలోచనా విధానం కూడా మారుతోంది. గతంలో కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడి ప్రజలు వైఎస్ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, విజయమ్మ, ప్రస్తుతం జగన్‌లను నెత్తిన పెట్టుకు న్నారు. ఏ ఎన్నిక వచ్చినా..ఎవరు నిలబడ్డా.. వారినే గెలిపించారు.

ఇక, గత ఎన్నికల్లో జగన్‌కు ఏకంగా లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీని ఇక్కడి ప్రజలు కట్టబెట్టారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ ఊసు లేకుండా పోయింది! ఇది నిజం!! ఈ మాట వైసీపీ నేతల్లోనే చర్చకు దారితీసింది. తాజాగా ఇక్కడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ కాకుండా.. పార్టీ స్థానిక నేతలను పురమాయించారు. దీంతో వారు జగన్ బేనర్‌ను పట్టుకుని.. ఇంటింటికీ తిరిగారు.

అయితే.. ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఎవరూ పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు. దీంతో వైసీపీ నాయకులు.. ముఖ్యంగా జగన్ తరఫున ఇక్కడ ఇంటింటికీ తిరిగిన వారు.. మీడియా వస్తోందని తెలిసి.. వెనక్కి వెళ్లిపోయారట. ఈ విషయం.. తాడేపల్లి వరకు రావడం.. దీనిపై వారు చర్చకు పెట్టడం గమనార్హం. అయితే.. ఇలా ఒక్కసారిగా.. జగన్‌పై వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత.. ప్రతిపక్షాలు దీనిపై ప్రచారం చేస్తున్నాయి.

అయితే.. ప్రతిపక్షాల విమర్శలకు జగన్ మౌనంగా ఉండడం. కనీసం.. సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి ప్రజలు.. ఒకింత సందేహంలో పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. దీనికితోడు.. ఉపాధి కల్పన, సంక్షేమం వంటివి కొందరికి అందకపోవడం.. ధరల పెరుగుదల.. చెత్తపై పన్ను వంటివి కూడా ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ఈ కారణంతోనే గడపగడపకు కార్యక్రమంలో ప్రజలు ఇంట్రస్ట్ చూపించలేదని అంటున్నారు.

అయితే.. అంతో ఇంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఇదేదో ప్రతిపక్షాలకు మేలు చేస్తుందని.. వైఎస్ కుటుంబం ఇక్కడ ఓడిపోతుందని కాదు. కానీ, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ తగ్గినా.. అది జగన్‌కు ఇబ్బందే కదా! అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. ఇక్కడి పరిస్థితిని సరిదిద్దుకునే కార్యక్రమాలు చేపడతారోలేదో చూడాలి.

Discussion about this post