పుంగనూరులో తిరుగులేని బలంతో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు టిడిపి గట్టిగానే కష్టపడుతుంది. ఎట్టి పరిస్తితులోనూ పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. పైగా పెద్దిరెడ్డి..చంద్రబాబు కంచుకోట కుప్పంని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. కుప్పంలో బాబుని ఓడించాలని పెద్దిరెడ్డి అధికార బలాన్ని ఉపయోగించి రాజకీయం చేస్తున్నారు.

దీంతో బాబు సైతం రివర్స్ ఎటాక్ మొదలుపెట్టి..పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జ్ గా చల్లా రామచంద్రారెడ్డిని ముందు పెట్టారు. నియోజకవర్గంలో ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. వైసీపీ పలు రకాలుగా టీడీపీని దెబ్బతీయాలని చూస్తుంది. అయినా సరే టీడీపీ వెనక్కి తగ్గట్లేదు. ఇలా వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్న తరుణంలో పుంగనూరులో కొత్త నేత తెరపైకి వచ్చారు. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రాయాదవ్‌ని వైసీపీ ఏ విధంగా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆయన ఇంటిపై దాడులు జరిగాయి.

ఈ క్రమంలోనే రామచంద్ర..హోమ్ మంత్రి అమిత్ షాని కలిసి పుంగనూరు పరిస్తితులని వివరించారు. దీంతో రామచంద్రకు వై కేటగిరీ భద్రతని ఇచ్చారు. ఇక అమిత్ షాతో భేటీ తర్వాత..పుంగనూరుకు వచ్చిన రామచంద్రా..తనదైన శైలిలో పెద్దిరెడ్డిపై పోటికి సిద్ధమని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అవసరం లేదని, తాను చాలని అన్నారు.

ఇక ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. అయితే ఈయన నారా లోకేష్‌ని కలుస్తారని టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది..కానీ లోకేష్‌ని కలవడం లేదని చెప్పారు. ఈ పార్టీ నుంచి పోటీ చేస్తానో త్వరలో చెబుతానని రామచంద్ర యాదవ్ చెప్పారు. తనకు అండగా ఉండే వారిని కాపాడుకునే బాధ్యత తనదే అని చెప్పుకొచ్చారు. చూడాలి మరి రామచంద్ర యాదవ్ ఎంతమేర పెద్దిరెడ్డికి చెక్ పెట్టగలరో.
