పుంగనూరు అంటే పెద్దిరెడ్డి అడ్డా అనే సంగతి అందరికీ తెలిసిందే..అక్కడ పెద్దిరెడ్డి తప్ప మరొకరికి గెలిచే అవకాశం లేదు..అసలు ఎన్నిక ఏదైనా అక్కడ వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు సాధించడం ఖాయం. ఇంకా చెప్పాలంటే పుంగనూరులో ప్రత్యర్ధి పార్టీలో చేయడమే కష్టం…ఒకవేళ పోటీ చేయాలని చూసిన…పెద్దిరెడ్డి వర్గం పోటీ చేయనివ్వకుండా ఎలాంటి కార్యక్రమాలు చేసిందో..గత పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లోనే అంతా చూశారు.

అంటే పుంగనూరు అనేది ఒక ప్రత్యేక రాజ్యం మాదిరిగా తయారైంది..అక్కడ రాజు అయిన, మంత్రి అయిన.అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. ఇక ఆయనని దాటి వేరే వాళ్ళు గెలవడం కష్టం. మరి అలా ఉన్న పుంగనూరులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..ఊహించని విధంగా టీడీపీ ఇంచార్జ్‌గా చల్లా రామచంద్రారెడ్డిని పెట్టడం, ఆయన గత లీడర్ల మాదిరిగా పెద్దిరెడ్డికి భయపడి సైలెంట్‌గా ఉండే కార్యక్రమాలు ఏమి చేయడం లేదు.

పూర్తిగా నియోజకవర్గంలో కలియతిరిగేస్తున్నారు…అక్కడ ప్రజా సమస్యలు ఉంటే ప్రశ్నిస్తున్నారు..టీడీపీ కార్యకర్తలకు ఏమన్నా ఇబ్బంది కలిగితే, వెంటనే వారికి అండగా ఉంటున్నారు..టోటల్‌గా నియోజకవర్గంలో మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నారు. ఇలా చల్లా పనితీరుతో పుంగనూరులో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది..అలాగే ఇప్పటివరకు సైలెంట్‌గా ఉండిపోయిన టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా బయటకొచ్చి పని చేయడం మొదలుపెట్టారు. అసలు పుంగనూరులో టీడీపీ కళకళలాడటం గొప్ప విషయమే అని చెప్పాలి.

అదే సమయంలో పుంగనూరు టీడీపీలో చేరికలు అనేవి పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేవని చెప్పాలి. తాజాగా పుంగనూరుకు చెందిన 50 మంది మైనారిటీలు చల్లా సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరిక టీడీపీకి ప్లస్ అనే చెప్పాలి..ఇక రానున్న రోజుల్లో మరింత ఎక్కువ చేరికలు జరిగేలా చల్లా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు సీటు గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తామని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డికి చల్లా చుక్కలు చూపించేలా ఉన్నారు.

Discussion about this post