గత ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచిన వారికి..ఈ సారి వచ్చే ఎన్నికల్లో కాస్త ఇబ్బంది ఎదురయ్యే పరిస్తితి కనిపిస్తోంది. అంత ఈజీగా మాత్రం గెలుపు దక్కడం కష్టమని అర్ధమవుతుంది. ఈ సారి జగన్ గాలి లాంటివి వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అలాగే గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఓడిపోయిన టీడీపీ సీనియర్ నేతలు…ఈ సారి అంత తేలికగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. ఇక నర్సీపట్నంలో కూడా ఇదే పరిస్తితి ఉన్నట్లు కనిపిస్తోంది.

అసలు నర్సీపట్నం అంటే చింతకాయల అయ్యన్నపాత్రుడు అడ్డా. నర్సీపట్నంలో అయ్యన్న ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖపట్నం టీడీపీలో కీలక నాయకుడుగా ఉంటున్నారు. ఇలా కీలకంగా ఉన్న అయ్యన్నని గత ఎన్నికల్లో డైరక్టర్ పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేశ్ ఓడించారు. గణేశ్ వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే గణేశ్ ఒకప్పుడు అయ్యన్న శిష్యుడే. అయ్యన్న వెనుక తిరిగే గణేశ్ లీడరుగా ఎదిగారు. తర్వాత ఆయనతో విబేధించి వైసీపీలోకి వచ్చేసి…ఆయనపైనే ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక ఎమ్మెల్యేగా గెలిచాక గణేశ్…తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. కాకపోతే ఈ రెండున్నర ఏళ్లలో అనుకున్న మేర మాత్రం గణేశ్ ఎమ్మెల్యేగా సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. అధికార పార్టీలో ఉన్నా సరే అయ్యన్నకు చెక్ పెట్టడంలో గణేశ్ విఫలమయ్యారని చెప్పొచ్చు. అసలు విశాఖలో టీడీపీ నుంచి వేగంగా పుంజుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది అయ్యన్నపాత్రుడు మాత్రమే.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ…జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవ్వడంలో ముందున్నారు. అలాగే నియోజకవర్గంలో పార్టీని త్వరగానే బలోపేతం చేశారు. ఈ రెండున్నర ఏళ్ల కాలంలో నర్సీపట్నంలో టీడీపీ చాలా వరకు పుంజుకుందనే చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఈ సారి నర్సీపట్నంలో గణేశ్‌కు మాత్రం అయ్యన్న ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.

Discussion about this post