మాజీ డిప్యూటీ సీఎం, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణికి ఇంట్లో వాళ్లే రాజకీయ ప్రత్యర్ధులుగా మారిపోయారు…ఇప్పటికే రాజకీయంగా నియోజకవర్గంలో కాస్త వ్యతిరేకత ఎదురుకుంటున్న పుష్పశ్రీకి ఇంట్లో వాళ్లే ప్రత్యర్ధులుగా మారడంతో రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే పరిస్తితి వచ్చింది. అనూహ్యంగా శతృచర్ల కుటుంబానికి చెందిన కోడలుగా ఉన్న పుష్పశ్రీ వాణి రాజకీయంగా మంచి విజయాలే సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి గెలిచారు. అలాగే 2019 ఎన్నికల్లో గెలిచాక బంపర్ ఆఫర్ కొట్టేశారు…గిరిజన శాఖ మంత్రితో పాటు, డిప్యూటీ సీఎం హోదా కూడా దక్కించుకున్నారు.

ఇక ఇలా పదవులు దక్కించుకున్న పుష్పశ్రీకి..ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది…కానీ అధికారం ఉన్నా సరే ప్రజలకు సేవ చేయడంలో పుష్పశ్రీ ఫెయిల్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోనే పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయారు. అసలు విచిత్రం ఏంటంటే…మంత్రివర్గంలో ఉన్న సరే ఆమె…మంత్రిగా ఉన్న విషయం పెద్దగా ఎవరికి తెలియలేదు. అంటే పుష్పశ్రీ పనితీరు అలా ఉందని చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే ఆమె మంత్రి పదవి పోయింది…పోనీ ఎమ్మెల్యే గా అయిన రాణిస్తున్నారా అంటే అది లేదనే చెప్పొచ్చు. గడప గడపకు వెళుతున్న పుష్పశ్రీకి ప్రజల నుంచి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇక ఇదే సమయంలో పుష్పశ్రీకి సొంత ఇంట్లోనే ప్రత్యర్ధులు వచ్చారు. సొంత ఆడపడుచు పల్లవి రాజు…పుష్పశ్రీ అక్రమాలని బయటపెడతానని విరుచుకుపడుతున్నారు. అలాగే టీడీపీలో చేరి కురుపాం సీటు దక్కించుకుని పుష్పశ్రీకి చెక్ పెట్టాలని పల్లవి చూస్తున్నారు.


అయితే కురుపాం సీటు కోసం టీడీపీలో చాలా పోటీ ఉంది…ఇప్పటికే దివంగత జనార్ధన్ ధాట్రాజ్ భార్య సైతం కురుపాం సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్పశ్రీపై పోటీకి ఇంట్లో వాళ్లే రెడీ అవుతున్నారు. ఇక కురుపాం నుంచి పుష్పశ్రీకి మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఏదేమైనా పుష్పశ్రీకి సొంత వాళ్లే చెక్ పెట్టేలా ఉన్నారు.

Discussion about this post