చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీ హవా ఎక్కువనే సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడిచింది. అయితే ఇప్పటికీ జిల్లాలో వైసీపీకి ఆధిక్యం ఉంది. కానీ ఆధిక్యాన్ని తగ్గించాలని బాబు కష్టపడుతున్నారు. అటు నారా లోకేష్ పాదయాత్ర వల్ల కూడా కాస్త మైలేజ్ వచ్చింది. దీంతో జిల్లాలో ఐదారు స్థానాల్లో టిడిపికి పట్టు వచ్చింది. కానీ ఇంకా కొన్ని స్థానాల్లో టిడిపి బలపడాలి.

కాకపోతే టిడిపికి పెద్దగా పట్టు దొరకడం లేదు. అలా పూతలపట్టు స్థానంలో టిడిపికి ఏ మాత్రం బలం కనిపించడం లేదు. అసలు ఇంతవరకు ఇక్కడ టిడిపి గెలవలేదు. 2008లో కొత్తగా ఏర్పడిన ఈ స్థానంలో ఇప్పటివరకు టిడిపి గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే..2009, 2014 ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీలతో టిడిపి ఓడిపోయింది. కేవలం వెయ్యి ఓట్లతోనే ఓటమి పాలైంది.
2019 ఎన్నికలకు వచ్చేసరికి భారీ మెజారిటీ తో ఓడిపోయింది. దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో టిడిపి ఓడిపోయింది. ఇక టిడిపి తరుపున మూడుసార్లు ఎల్. లలితకుమారి ఓటమి పలాయరు. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఆమె టిడిపికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అప్పటినుంచి పూతలపట్టులో టిడిపికి నాయకులు లేరు. బాబు కూడా ఇంతవరకు ఇంచార్జ్‌ని పెట్టలేదు.

దీని వల్ల అక్కడ టిడిపికి బలం కనిపించడం లేదు. అసలు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు పాజిటివ్ లేదు..ఆయనపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది..కానీ టిడిపిలో సరైన నాయకుడు లేకపోవడం వైసీపీకి అడ్వాంటేజ్. ఇప్పటికిప్పుడు నాయకుడుని పెట్టిన ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పూతలపట్టులో టిడిపి గెలవడం సాధ్యమవుతుంది తప్ప..మామూలుగా చూసుకుంటే పూతలపట్టులో మళ్ళీ టిడిపి గెలవడం కష్టమే