టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమవుతుందనే చెప్పవచ్చు..అధికారికంగా పొత్తుపై క్లారిటీ రాలేదు గాని..అంతర్గతంగా పొత్తు మాత్రం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇక పొత్తులో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనేది క్లారిటీ లేదు..అటు జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందనేది తెలియదు. కాకపోతే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే పవన్‌కు సీఎం పదవి ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ డిమాండ్ కాపుసేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కూడా చేశారు.

వైసీపీ అరాచక పాలనకు టీడీపీ-జనసేన కలిసి చెక్ పెట్టాలని, అదే సమయంలో రెండు పార్టీల పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. సరే పవన్‌కు సీఎం సీటు అడగటంలో తప్పు లేదు గాని..ఆ డిమాండ్ అనేది అర్ధవంతంగా ఉంటే బాగుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీకి ఉన్న బలం జనసేనకు లేదు. ఒకసారి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం చూసుకుంటే టీడీపీకి 40, జనసేనకు 6 శాతం ఓట్లు పడ్డాయి.

అంటే చాలా పెద్ద తేడా ఉంది. సరే ఇప్పుడు జనసేన బలం పెరిగిందని అంచనా వేస్తున్నారు..ఇటీవల సర్వేల్లో 9 శాతం వరకు జనసేన శాతం వచ్చిందని అంటున్నారు. అటు టీడీపీకి 43 శాతం వరకు ఓట్ల శాతం వచ్చిందని అంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా తేడా ఉంది. పోనీ జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలవగలదు. ఆ సీట్లతో పవన్ సీఎం అవ్వగలరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి లాభం ఉంది..అది కాదనలేని పరిస్తితి. అదే సమయంలో పొత్తు వల్ల జనసేనకు లాభం ఉంది. అయితే సీఎం సీటు డిమాండ్ అనేది కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. ఈ వాదనలు పక్కన పెట్టి రెండు పార్టీలు కలిసి పనిచేస్తేనే వైసీపీని నిలువరించడం కుదురుతుందని అంటున్నారు.

Leave feedback about this