ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి…ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. ఆ మధ్య వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరుని టీడీపీ నేతలు ఎక్కువ తీసుకొచ్చారు. దీంతో రాచమల్లు..అవినాష్‌కు అండగా నిలిచి…ఆఖరికి టీడీపీ అనుకూల మీడియాకొచ్చి వాదించారు కూడా. ఇలా తమ పార్టీ ఎంపీగా అండగా నిలిచిన రాచమల్లుకు ఇప్పుడు అదే పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా ఉన్నారు.

అసలు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ల మధ్య పెద్ద వార్ నడుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…రమేష్ యాదవ్, రాచమల్లు అనుచరుడే. ఇప్పుడు ఆయనే రివర్స్ అయ్యే పరిస్తితికి వచ్చారు. అయితే వీరి మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. నిజానికి రమేష్ ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ కావాలి..కానీ రాచమల్లు చక్రం తిప్పి లక్ష్మీదేవి అనే ఆమెని చైర్‌పర్సన్ చేశారు. ఇక్కడ నుంచే రచ్చ మొదలైంది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిన తనకు పదవి రాకపోవడంపై రమేష్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

ఇదే క్రమంలో అనూహ్యాంగా జగన్, రమేష్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు. దీంతో ప్రొద్దుటూరులో రమేష్ హవా పెరిగింది. ఇక రాచమల్లు, రమేష్‌లు సెపరేట్‌గా కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. రాచమల్లు కార్యక్రమాల్లో రమేష్ బొమ్మ ఉండదు…రమేష్ కార్యక్రమాల్లో రాచమల్లు బొమ్మ ఉండదు. ఈ విషయంపై ఒకసారి ప్రొద్దుటూరులో గొడవ కూడా జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రూపుల మధ్య ఫైట్ జరిగింది.

ఇలా ప్రొద్దుటూరులో రచ్చ నడుస్తూనే ఉంది..ఇదే క్రమంలో రాచమల్లు సీటుకే రమేష్ ఎర్త్ పెట్టేవరకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు టిక్కెట్ బీసీలకు వస్తుందనే ప్రచారం మొదలైంది. ఒకవేళ రాచమల్లుకే మళ్ళీ టిక్కెట్ వచ్చిన రమేష్ వర్గం సహకరించేలా లేదు. మొత్తానికి సొంత పార్టీ నేతలే రాచమల్లుకు చెక్ పెట్టేలా ఉన్నారు.

Discussion about this post