కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉండే గుడివాడ నియోజకవర్గం…మరోసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే గుడివాడలో నానీని ఢీకొట్టే నాయకుడే లేరని చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మొన్నటివరకు బలంగా ఉన్న టిడిపి వీక్ అవుతూ వస్తుంది. పైగా ఇక్కడ టిడిపి ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు అంత ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. దీంతో నానికి గుడివాడలో తిరుగులేకుండా పోయింది. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే గుడివాడలో మాత్రం కొడాలి హవానే కొనసాగుతుందనేలా పరిస్తితి ఉంది.

ఇలాంటి పరిస్తితుల్లో గుడివాడ రాజకీయాల్లో ఒక సంచలన విషయం హల్చల్ చేస్తుంది. గుడివాడ బరిలో వంగవీటి రాధా పోటీ చేయొచ్చు అంటూ కథనాలు వస్తున్నాయి. మామూలుగా ఏ పార్టీలో ఉన్న…నాని, రాధాలు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఏ పార్టీలో ఉన్నా తమ స్నేహాన్ని మాత్రం వదులుకునే వారు కారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు గానీ, రాధా ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో ఒంటరిగా తిరుగుతున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల రాధా వరుసగా కాపు సామాజికవర్గ నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారని తెలిసింది.

అయితే నానితో సంబంధం లేకుండా రాధా ఈ పర్యటనలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో నాని-రాధా స్నేహానికి బ్రేక్ పడిందని గుసగుసలు మొదలయ్యాయి. ఇదే సమయంలో రాధా, నెక్స్ట్ గుడివాడలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల ముందు టిడిపిలో చేరిన రాధా…ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తర్వాత రాధా పార్టీతో సంబంధం లేకుండా ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చెరోచ్చని ప్రచారం కూడా వచ్చింది. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి గుడివాడలో దిగే అవకాశాలు ఉన్నాయని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చూడాలి మరి రాధా రాజకీయం ఎలా ఉంటుందో..?

Discussion about this post