ఇప్పుడుప్పుడే రాజకీయంగా వంగవీటి రాధా యాక్టివ్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇంతకాలం పూర్తి స్థాయిలో రాజకీయం చేయని రాధా..నిదానంగా దూకుడు కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే రాధా ప్రస్తుతానికి టీడీపీలోనే ఉన్నారని మాత్రం అర్ధమవుతుంది. ఎందుకంటే ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం వస్తూనే ఉంది. కానీ ఆయన ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు కనబడటం లేదు.

ఏదో ఫంక్షన్‌లో కొడాలి నానిని కలిశారు గానీ, ఆయన ద్వారా వైసీపీలోకి వెళ్లాలనే ప్రయత్నం మాత్రం చేయలేదని తెలుస్తోంది. అయితే కొడాలి మాత్రం వైసీపీలోకి తీసుకురావడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే రాధా మాత్రం వైసీపీలోకి వెళ్ళడం మాత్రం జరిగే పని కాదని అర్ధమవుతుంది. ఎందుకంటే రాజకీయంగా రాధా వేసే అడుగులు బట్టి చూస్తే, ఆయన వైసీపీ వైపు వెళ్ళడం లేదని తెలుస్తోంది.

ఇటీవల టీడీపీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తే…పట్టాభి ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులని పరామర్శించారు. అలాగే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన్ని టీడీపీ నేతగానే సంభోదించారు. రాధా ఇంకా టీడీపీలోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ విషయం పక్కనబెడితే…తాజాగా రాధా…అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్ధతు తెలిపారు. అంటే అమరావతికి వ్యతిరేకంగా వైసీపీ ఉన్న విషయం తెలిసిందే. కానీ అదే అమరావతికి రాధా మద్ధతు ఇస్తున్నారు.

దీని బట్టి చూస్తే రాధా క్లియర్‌గా వైసీపీకి యాంటీగానే ఉన్నారు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో రాధా పోటీ చేస్తారా? లేదా? అనేది డౌట్. పోటీ దిగితే టీడీపీ నుంచే పోటీ చేస్తారా లేక జనసేనలోకి వెళ్ళి పోటీ చేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. అయితే రాధా గుడివాడలో నాని మీద పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. పైగా టీడీపీ-జనసేనలు పొత్తు ఉంటే ఖచ్చితంగా రాధా గుడివాడలో పోటీ చేయొచ్చని తెలుస్తోంది. చూడాలి మరి రాధా రాజకీయం ఎలా ఉంటుందో?


Discussion about this post