వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు…వైసీపీకి ఎప్పుడు ఏదొక షాక్ ఇస్తూనే ఉన్నారు. ఢిల్లీలో ఉంటూ రచ్చబండ కార్యక్రమం పేరిట వైసీపీ ప్రభుత్వంపై నిత్యం ఏదొక అంశంపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అలాగే పార్టీలోని అంతర్గత అంశాలని సైతం బయటపెట్టి వైసీపీకి బుక్ చేసేస్తున్నారు. మొదట నుంచి రఘురామ అదే తీరులో ముందుకెళుతున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో తాజాగా రఘురామ…వైసీపీపై మరో బాంబ్ వేశారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు వస్తున్నాయని, వైసీపీలో ఇష్టం లేని ఎంపీలను, ఎమ్మెల్యేలతో తిట్టిస్తుంటారని, తనని కూడా కొంత మంది ఎమ్మెల్యేలతో తిట్టించారని గుర్తు చేసిన రఘురామ… తాజాగా తన నియోజకవర్గం దగ్గరలోని ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని, దీంతో వాళ్లిద్దరి కంటే పైన ఉన్న ఓ వ్యక్తి.. ఆ ఇద్దరిలో ఒకరిని కొట్టారని చాలా పెద్ద వార్త బయటకు వచ్చిందని షాక్ ఇచ్చారు.

అయితే ఆ ఎమ్మెల్యే, ఎంపీ పేర్లు తాను బయటపెట్టడం కరెక్ట్ కాదని, కానీ త్వరలోనే వారి గురించి వార్తలు వస్తాయని, అప్పుడు స్పందిస్తానని అన్నారు. ఇక రఘురామ ఈ బాంబ్ పేల్చడంతో ఇప్పుడు వైసీపీలో గొడవ పడిన ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు..ఎవరిని పైనున్న వ్యక్తి కొట్టారనే టాక్ నడుస్తోంది. రఘురామ తనకు దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అన్నారు. అయితే ఇటీవల రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.

ఓపెన్‌గానే వారు విమర్శలు చేసుకున్నారు. ఇక వారి మధ్య పోరుని వైవీ సుబ్బారెడ్డి సెటిల్ చేశారు. ఇదంతా రెండు నెలల క్రితం జరిగిన వ్యవహారం. ఆ వ్యవహారం అప్పుడే సద్దుమణిగినట్లు కనిపించింది. మరి రాజు గారు మాట్లాడేది ఈ వ్యవహారం గురించేనా లేక వేరే వారి గురించి మాట్లాడరా అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే రఘురామ వరుసపెట్టి బాంబులు పేలుస్తూ, వైసీపీని ఆడుకుంటున్నారు.

Discussion about this post