వైసీపీకి, రఘురామకృష్ణంరాజుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి…ఆ పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజుగారిని దెబ్బకొట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వంలోని లోపాలని ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ…వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ రఘురామ ముందుకెళుతున్నారు. మామూలుగా రాజుగారు జోలికి వెళ్లకుండా ఉంటే బాగానే ఉంటుంది…కానీ వైసీపీ వాళ్ళు ఏదొక సందర్భంలో ఆయన్ని అనవసరంగా కెలుకుతున్నట్లు కనిపిస్తోంది.

అందుకే ఆయన కూడా ఇంకా దూకుడుగా వైసీపీపై ఫైర్ అవుతున్నారు. తాజాగా రాజుగారిని వైసీపీ ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది. నిత్యం లోక్‌సభలో జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని రఘురామ ఎత్తిచూపుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ తిరుపతి వరకు మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులని, మహిళలని పోలీసులు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలిసిందే. ఇదే అంశాన్ని రఘురామ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ క్షీణించాయని మాట్లాడారు. దీనికి వైసీపీ ఎంపీలు అదే స్థాయిలో కౌంటర్లు ఇవ్వొచ్చు కానీ..అలా కాకుండా రఘురామపై రెండు సిబిఐ కేసులు ఉన్నాయని తక్షణమే వాటిని విచారించాలని, అలాగే రఘురామ బీజేపీలో చేరడానికి తహతహలాడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్..రఘురామని ఉద్దేశించి బూతులు తిట్టారని తెలిసింది. ఆ విషయాన్ని రఘురామ స్వయంగా మీడియాకి వివరించారు. అలాగే సురేష్‌పై స్పీకర్‌కు, మోదీలకు ఫిర్యాదు చేశారు.

ఇక తనపై రెండు కేసులు ఉంటే….జగన్‌పై బోలెడు సిబిఐ కేసులు ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. అంటే ఇక్కడ వైసీపీ…అనవసరంగా రఘురామని కెలికినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఎంపీ సురేష్‌కు ఇప్పటికే చాలా నెగిటివ్ ఉంది..ఇలాంటి సమయంలో ఆయన ఏకంగా లోక్‌సభలోనే బూతులు మాట్లాడటం మరింత నెగిటివ్ ఆవుతుంది.
Discussion about this post