వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. తిరిగి ఉప ఎన్నికలకు వెళతానని సవాళ్లు రువ్వుతున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు కూడా ఓకే చెప్పినట్టు టాక్ ? అయితే మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి టైంలో ఉప ఎన్నికలకు వెళ్లడం రిస్కే అని బీజేపీ భావిస్తోందట.

ఇలాంటి టైంలో ఉప ఎన్నిక జరగడం సబబు కాదని బీజేపీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఒక్క విషయంతోనే రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలా ? వద్దా ? అన్న విషయంలో సందిగ్ధంలో ఉన్నారని అంటున్నారు. రఘురామ ప్రతి రోజూ రచ్చబండ కార్యక్రమంతో వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీ వాళ్లు ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.ఇది స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది.

నరసాపురంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు ఎవరిది అన్న విషయంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన సొంతంగా పోటీ చేస్తే 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీపై వైసీపీ నుంచి పోటీ చేసిన రఘురామ కేవలం 26 వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఇక్కడ బీజేపీకి ఓట్లు లేవు. అయితే ఇప్పుడు రఘురామ పోటీ చేస్తే జనసేన పొత్తు ఉన్నా కూడా ఆ పార్టీ ఓట్లు అటు టర్న్ కావు.

అయితే జనసేన ఓట్లలో మెజార్టీ ఓటు షేర్ టీడీపీకి టర్న్ అయితే అది పరోక్షంగా టీడీపీకి ప్లస్ అవుతుంది. దీనికి తోడు వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఓటు కూడా టీడీపీకి పడితే అది వైసీపీకి మైనస్ అవుతుంది. జనసేన బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఇక్కడ ఎలాగూ పోటీ చేసే ఛాన్సులు లేవు. మరి ఈ ఈక్వేషన్లలో నరసాపురంలో ఏం జరుగుతుంది ? అన్నది ఆసక్తిగా మారింది.

Discussion about this post