ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ బలహీనపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుండటం మైనస్ గా మారింది. అదే సమయంలో ప్రతిపక్ష టిడిపి పుంజుకుంటుంది. అటు జనసేన ప్రభావం కూడా ఉంది. అయితే టిడిపి-జనసేన పొత్తు ఉంటే జిల్లాలో వైసీపీకి భారీ షాకులు తప్పవు. అయితే పొత్తు అనేది ఎన్నికల సమయంలోనే తేలేలా ఉంది.

ఈలోపు సింగిల్ గా బలపడాలనే ప్లాన్ లో టిడిపి ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం..పలు అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెడుతూ వస్తున్నారు. దాదాపు అన్నీ స్థానాల్లో టిడిపికి బలమైన అభ్యర్ధులు ఉన్నారు. కానీ కాకినాడ రూరల్, రాజానగరం సీట్లలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కాకినాడ రూరల్ లో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ నిలకడ లేని రాజకీయం వల్ల..ఆమెని సైడ్ చేసినట్లే కనిపిస్తున్నారు. ఆ సీటు పేరాబత్తుల రాజశేఖర్‌కు ఇస్తారని తెలుస్తోంది.


అటు రాజానగరంలో పెందుర్తి వెంకటేష్‌కు చంద్రబాబు గట్టిగా క్లాస్. ఇచ్చిన విషయం తెలిసిందే. బాగున్న నియోజకవర్గాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. దీంతో వెంకటేష్ మనస్తాపం చెంది ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజానగరం సీటు ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే రాజానగరంకు మాజీ మంత్రి చినరాజప్పని పంపిస్తారని, ఇటు రాజప్ప ఉన్న పెద్దాపురం సీటుని కమ్మ వర్గానికి ఇస్తారని ప్రచారం వస్తుంది.


రాజానగరంలో కాపు వర్గం హవా ఎక్కువ అందుకే అదే వర్గానికి చెందిన రాజప్పని అటు పంపిస్తారని, కమ్మ వర్గం హవా ఉన్న పెద్దాపురం సీటుని కమ్మ వర్గం నేతకు కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సీట్ల విషయంలో బాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
