రాజమండ్రి గడ్డ…తెలుగుదేశం పార్టీ అడ్డ…ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పొచ్చు..రాజమండ్రి ప్రాంతంలో టీడీపీ మొదట నుంచి సత్తా చాటుతునే వస్తుంది. అసలు రాజమండ్రిలో టీడీపీకి చెక్ పెట్టడం అనేది ప్రత్యర్ధి పార్టీలకు కష్టమైన పని చెప్పొచ్చు…1983 నుంచి 2019 వరకు రాజమండ్రిలో టీడీపీ విజయాలకు పెద్దగా బ్రేకులు లేవు..ఇక 2009లో రాజమండ్రి సిటీ, రూరల్ స్థానాలుగా విడిపోయాక కాస్త టీడీపీకి చెక్ పడింది.

సిటీలో కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన బుచ్చయ్య చౌదరీ ఓడిపోయారు…కానీ రూరల్ లో మాత్రం టీడీపీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరీ రూరల్ నుంచి గెలవగా, టీడీపీ పొత్తులో భాగంగా సిటీ నుంచి బీజేపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ లేకపోతే బీజేపీ గెలుపు అసాధ్యమనే చెప్పాలి. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి రాష్ట్రమంతా జగన్ గాలి వీచిన సరే రాజమండ్రిలో మాత్రం సైకిల్ సవారీ జరిగింది.

సిటీలో టీడీపీ నుంచి పోటీ చేసి ఆదిరెడ్డి భవానీ దాదాపు 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలవగా, ఇటు రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరీ దాదాపు 11 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా రాజమండ్రిలో టీడీపీ సత్తా చాటింది…అయితే వచ్చే ఎన్నికల్లో కూడా రాజమండ్రిలో సైకిల్ ని నిలువరించడం ఫ్యాన్ కు సాధ్యం కాదనే చెప్పాలి…ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే రాజమండ్రిలో టీడీపీ బలం తగ్గించడంలో వైసీపీ విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది.

ఏ మాత్రం కూడా టీడీపీకి చెక్ పెట్టడంలో వైసీపీ సక్సెస్ కాలేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా రాజమండ్రిలో టీడీపీని ఆపడం వైసీపీ వల్ల అయ్యేలా లేదు..ఇప్పటికీ ఆదిరెడ్డి ఫ్యామిలీ, ఇటు బుచ్చయ్య చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో గాని జనసేన పొత్తు ఉంటే..రాజమండ్రిలో వైసీపీ గెలవడం జరిగే పని కాదు..ఏ మాత్రం డౌట్ లేకుండా రాజమండ్రిలో సైకిల్ హవానే ఉంటుంది.


Discussion about this post