జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని ఇచ్చింది. ఇక ఈ స్థలంలో ఎంత ఇల్లు పడుతుందనే విషయం పక్కనబెడితే…పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పేరుతో వైసీపీ నేతలు కోట్లు వెనుకేసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఉదాహరణకు ఇళ్ల స్థలాల కోసం…ఒక ఎకరం కొనుగోలు చేయాల్సి వస్తే…మార్కెట్ రేటు ప్రకారం రూ.10 లక్షలు ఉంటే..వైసీపీ నేతలు రూ.30 లక్షలు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో కొనేసి…పొలం అమ్మిన రైతుకు 10 లక్షలు ఇచ్చి, మిగిలిన 20 లక్షలు వైసీపీ నేతల ఖాతాలోకి వెళ్ళాయని ఆరోపణలు వచ్చాయి.

ఇది కేవలం చిన్న ఉదాహరణే..ఇలా అనేక రకాలుగా ఇళ్ల స్థలాల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష టీడీపీ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తూనే ఉంది. అలాగే శ్మశానల్లో, కొండల్లో, గుట్టల్లో, చెరువుల్లో, అడవుల్లో అన్నట్లుగా స్థలాలు ఇచ్చారు. ఇదే క్రమంలో రాజమండ్రిలో ఆవ భూముల్లో స్థలాలు ఇవ్వడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇందులో రాజమండ్రికి చెందిన కొందరు వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు.

ఎంపీ భరత్ ఇళ్ల స్థలాల పేరుతో ఏకంగా వందకోట్లు దోచుకున్నారని బుచ్చయ్య ఆరోపించారు. అలాగే కడియం మండలం వేమగిరిలో 20 ఎకరాల్లో ఉన్న కొండను చెరువులుగా తవ్వేసి ఎంపీ అనుచరులు 60 కోట్ల విలువైన గ్రావెల్‌ను అమ్ముకున్నారంటూ బుచ్చయ్య తాజాగా ఆరోపణలు గుప్పించారు. రాజమండ్రి వైసీపీ నేతలు గ్రావెల్ దందా, సారా వ్యాపారం, ఆవ భూముల్లో అక్రమాలు…ఇలా లెక్కలేని అక్రమాలు చాలా చేశారని అంటున్నారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని బుచ్చయ్య డిమాండ్ చేస్తున్నారు.

అయితే దీనిపై ఎంపీ అనుచరులు స్పందిస్తున్నారు గానీ, ఎంపీ మాత్రం స్పందించడం లేదు. అయితే ఇక్కడ అక్రమాల విషయంలో రాజమండ్రి ప్రజలకు కూడా బాగానే క్లారిటీ ఉన్నట్లు కనిపిస్తోంది. అటు వైసీపీలో ఎంపీ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న మరో వర్గం…ఈ ఆరోపణలు నిజమే అని గుసగుసలాడుతుంది. మొత్తానికైతే రాజమండ్రిలో చాలానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Discussion about this post