గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో సైతం టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఒకటి..దాదాపు 30 వేల ఓట్లపైనే ఆదిరెడ్డి భవాని గెలిచారు. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా, ఇటు ఆదిరెడ్డి ఫ్యామిలీ కోడలుగా ఆమె సత్తా చాటారు. ఇలా టీడీపీ కైవసం చేసుకున్న ఈ సీటుని సొంతం చేసుకోవడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంచార్జ్‌ల మీద ఇంచార్జ్‌లని మారుస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా సమర్ధవంతంగా పనిచేయడంలో సక్సెస్ అవ్వలేదు.

ఇక చివరికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయనే సిటీ బాధ్యతలు చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సిటీ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఈయనకు వ్యతిరేకంగా వైసీపీలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎప్పటినుంచో భరత్-రాజాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒక సందర్భంలో వీరు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టుకుని మరీ విమర్శించుకున్నారు.


దీనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది…ఇద్దరినీ జగన్ పిలిపించుకుని క్లాస్ పీకి పంపించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు బహిరంగంగా ఎక్కడ విమర్శలు చేసుకోలేదు. కానీ అంతర్గతంగా వీరి మధ్య రచ్చ నడుస్తుందని తెలుస్తోంది. పైగా రాజమండ్రి సిటీ సీటు భరత్ దక్కించుకోవాలని చూస్తుంటే..ఆ సీటుని కాపు నేతలకు ఇప్పించాలని రాజా ట్రై చేస్తున్నట్లు సమాచారం. దీంతో సిటీ సీటులో వైసీపీలో రచ్చ నడుస్తోంది.

అసలే సిటీలో వైసీపీ వీక్ గా ఉంది..ఇప్పుడు ఈ పోరుతో మరింత వీక్ అయ్యేలా ఉంది..దీని వల్ల మళ్ళీ ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి.
