ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం గత 15 ఏళ్లుగా టిడిపి గెలుపుకు దూరమైన స్థానం. 2009, 2014, 2019 ఎన్నికల్లో టిడిపి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టిడిపిలోకి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. ఆయన పోటీ చేసిన కూడా టిడిపికి ఓటమి తప్పలేదు.

ఓడిపోయాక కొన్ని రోజులుగా యాక్టివ్ గా కనిపించలేదు. మళ్ళీ రాజకీయ మారుతుండటంతో కొండ్రు యాక్టివ్ అయ్యి రాజాంలో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిభా సైతం రాజాంపై పట్టు పట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కొండ్రు వైపే మొగ్గు చూపుతున్నట్లే కనిపిస్తున్నారు. ఆయనకే సీటు ఖాయం చేసేలా ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా కంబాల జోగులు ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయనే వరుసగా గెలుస్తూ వచ్చారు.



అయితే ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. పథకాల తప్ప రాజాంలో జరిగే అభివృద్ధి లేదు. అక్రమాలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీంతో జోగులుపై వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో నెక్స్ట్ ఆయన గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ నాయకులని కొండ్రు టిడిపిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా రాజాం మునిసిపాల్టీలో 250 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ సీనియర్ నాయకుడు, తెలగ వీధికి చెందిన నంది సూర్యప్రకాశరావు, ప్రముఖ వ్యాపారవేత్త బనిశెట్టి వెంకటరావులు టిడిపిలో చేరారు.


ఇక టిడిపిలో గ్రూపు తగాదాలు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేస్తే 15 ఏళ్ల తర్వాత రాజాంలో టిడిపి జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నాయి.
