ఈ మధ్య చంద్రబాబు ఎక్కడకు వెళితే అక్కడ..ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. బాబు రోడ్ షోలకు సభలకు జనం భారీగానే వస్తున్నారు. ఎంత జనాలని తరలించిన ఎక్కువ సేపు వెయిట్ చేయడం జరగదు. కానీ బాబు కోసం జనం ఎదురుచూస్తున్నారు. దీని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో కాస్త మార్పు కనిపిస్తుందని చెప్పవచ్చు. తాజాగా బాబు రాజాం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ బాబు పర్యటనకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు వచ్చాయి.

స్థానిక ప్రజలు సైతం బాబు సభకు వచ్చారు. అలాగే బాబు సైతం ఇదివరకు లాగా బోరు కొట్టించే స్పీచ్‌లు ఇవ్వకుండా మంచి పదునైన స్పీచ్‌లతో జనాలని ఆకట్టుకుంటున్నారు. అలాగే అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజాం సభలో కూడా జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇక రాజాం సభతో అక్కడ టీడీపీలో కొత్త ఉత్సాహం కనిపించింది. సభకు భారీ ఎత్తున జనం వచ్చారు. దీంతో రాజాంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుందని చెప్పవచ్చు.

అయితే గత మూడు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోతూ వస్తుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ఈ సారి ఎన్నికల్లో కూడా ఓడిపోతే టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే ఇక్కడ టీడీపీ గెలుపు ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు బాబు టూర్‌తో రాజాంలో పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా ఉంది. ఇక ఇక్కడ అంతా బాగానే ఉంది గాని..ఒక్క అభ్యర్ధి విషయంలో క్లారిటీ రావాలి.

ఈ సీటు కోసం మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల టీడీపీలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయి. కాబట్టి బాబు త్వరగా ఈ సీటు తేల్చి..అంతా కలిసికట్టుగా పనిచేసేలా చేస్తే..నెక్స్ట్ రాజాం సీటు టీడీపీ ఖాతాలో పడుతుంది.
