నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో ఫుల్ ఫాంలో ఉన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ రు. 100 కోట్ల సినిమాగా అఖండ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా హిట్ అయి వరుసగా మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ కు చెందిన డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో కూడా అన్‌స్టాపబుల్ షో చేస్తున్నారు.

ఈ టాక్ షో కు అదిరిపోయే హిట్ టాక్ వచ్చింది. ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు నేచురల్ స్టార్ నాని – అనిల్ రావిపూడి – బ్రహ్మానందం తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షో కు వచ్చారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళి సైతం తన సోదరుడు కీరవాణి తో కలిసి ఈ టాప్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య తనతో సినిమా చేయనని మీరు అన్నారని… మీరు బాలయ్యను హ్యాండిల్ చేయలేనని అన్నట్టు నాకు తెలిసింది అని ప్రశ్నించారు. అప్పుడు రాజమౌళి బాలయ్యతో సినిమా అంటే తనకు భయం అని… తాను షూటింగ్ లో ఉన్న సమయంలో అవతలి వారి గురించి పట్టించుకోనని… హీరో ఎండలో ఉన్నారా ? ఎక్కడ ఉన్నారు ? అన్నది పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమై ఉంటానన్నాడు.

అలా ఉంటే మీకు ఎక్కడ కోపం వస్తుందేమో అన్న భయం తోనే తాను మీతో సినిమా చేయలేదని రాజమౌళి చెప్పారు. అయితే బాలయ్య స్పందిస్తూ తాను షూటింగ్ లో ఎంత ఎండలో ఉన్నా ? ఎలా ఉన్నా గొడుగు కూడా అవసరం లేకుండా సిద్ధంగా ఉంటాను అని… నాతో అలాంటి భయం మీకు ఏమీ అక్కర్లేదని చెప్పాడు.

అలా మొత్తానికి ఈ షోలో ఇద్దరి మధ్య అనేక అంశాలు సరదాగా చర్చకు వచ్చాయి. తాను కూడా గతంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకున్నానని… అయితే ఆ కథకు భారీ బడ్జెట్ అవుతుందని నాన్నగారు వద్దని చెప్పటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాను అని బాలయ్య చెప్పారు.

Discussion about this post