రాజంపేట …వైసీపీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి…ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువే ఉంది..రాజంపేట అసెంబ్లీ గాని, రాజంపేట పార్లమెంట్ స్థానంలో గాని వైసీపీకి చెక్ పెట్టడం ఈజీ కాదు. అయితే 1999 ఎన్నికల తర్వాత 2014లో రాజంపేటలో టీడీపీ గెలిచింది..మళ్ళీ 2019 ఎన్నికల్లో రాజంపేట వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఇప్పుడు నిదానంగా అక్కడ టీడీపీ పుంజుకుంటుంది. వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత నిదానంగా పెరుగుతుంది. పైగా జిల్లాల విభజన వైసీపీకి మైనస్…ఇక్కడ టీడీపీ నేత చెంగల్రాయుడు నిదానంగా బలం పెంచుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.


అటు రాజంపేట పార్లమెంట్ స్థానం విషయానికొస్తే…ఇక్కడ టీడీపీ చివరిగా గెలిచింది..1999 ఎన్నికల్లోనే. అంతకముందు 1984లో గెలిచింది. అంతే ఇంకెప్పుడు రాజంపేట పార్లమెంట్ లో టీడీపీ గెలవలేదు. గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ తరుపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే రాజంపేటలో మిథున్ రెడ్డికి చెక్ పెట్టడం చాలా కష్టమవుతుంది…ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుంది.

పైగా రాయచోటి, పుంగనూరు, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది. అందుకే రాజంపేట పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గెలుపు సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది..పర్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ వీక్ అవుతుంది. రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది…ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా బలపడితే వైసీపీకి తిప్పలే.

పైగా రాజంపేట ఎంపీగా మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ దగ్గర బంధువు గంటా నరహరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న నరహరి తాజాగా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో సత్యప్రభ…రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే…నెక్స్ట్ ఆమె అనారోగ్యంతో చనిపోయారు. దీంతో పార్టీలోకి వచ్చిన నరహరికి రాజంపేట పార్లమెంట్ సీటు ఇవ్వొచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ సారి మాత్రం మిథున్ రెడ్డి గట్టి పోటీని ఎదుర్కోవాల్సిందే.

Discussion about this post