విడదల రజిని…తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎమ్మెల్యే. అయితే ప్రజలకు పనులు చేసి కాకుండా చేశామనే ప్రచారాలతో రజిని బాగా ఫేమస్ అయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. సరే ఎలా వచ్చిన గానీ రజినికి ఫాలోయింగ్ వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇలా ఫాలోయింగ్ తెచ్చుకోవడం వెనక ఆమె స్ట్రాటజీయే ప్రధాన కారణం. ఇంకా చెప్పాలంటే త్వరలో జరిగే మంత్రి వర్గ ప్రక్షాళనలో ఆమెకు మంత్రి పదవి ఖాయమని కూడా రజనీ వర్గం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే మంత్రి పదవి వస్తుందో రాదో తెలియదు గానీ నెక్స్ట్ ఎన్నికల్లో రజినికి ప్రత్తిపాటి పుల్లారావు రూపంలో ఓటమి మాత్రం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని గుంటూరు తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని…టిడిపిలో చేరి ప్రత్తిపాటి వెనుక రాజకీయం చేశారు. సడన్‌గా టిక్కెట్ కోసం 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి జంప్ చేసి…వైసీపీలో ఉన్న సీనియర్ నేతలనీ సైతం సైడ్ చేసి చిలకలూరిపేట సీటు దక్కించుకున్నారు.

ఇక జగన్ గాలిలో ప్రత్తిపాటిపై విజయం కూడా దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఏ మేర సేవ చేస్తున్నారో తెలియదు గానీ, సేవ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం బాగానే జరుగుతుంది. ఈ ప్రచారమే రజినికి ఇబ్బంది అయ్యేలా ఉంది. ప్రజలు నిదానంగా ప్రత్తిపాటికి వైపుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అధికార బలం ఉండటంతో స్థానిక పోరులో వైసీపీ గెలిచింది గానీ, సాధారణ ఎన్నికలోచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదని తెలుస్తోంది.

ఇప్పటికే ప్రత్తిపాటి పుంజుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే, ఇప్పుడు పేటలో జరిగే అభివృద్ధి శూన్యం. దీంతో ప్రజలు మళ్ళీ ప్రత్తిపాటి వైపు షిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే సొంత పార్టీలో రజినికి వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఈ పరిస్తితుల నేపథ్యంలో నెక్స్ట్ రజినికి ప్రత్తిపాటి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.

Discussion about this post