సరిగ్గా మూడేళ్ళ క్రితం అంటే..2019 ఎన్నికల ముందు అధికారంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేశారో చెప్పాల్సిన పని లేదు…ఉన్నవి, లేనివి క్రియేట్ చేసి…టీడీపీ ఎమ్మెల్యేలని, మంత్రులని నెగిటివ్ చేశారు. దీంతో చాలామంది టీడీపీ నేతలకు ఎన్నికల్లో ఇబ్బంది అయింది…ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళడంతో టీడీపీ నేతలు ఓటమి పాలయ్యారు. అప్పుడు మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు పరిస్తితి కూడా అంతే…పుల్లారావుపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేశారు.

ఇక అప్పటివరకు ప్రత్తిపాటి వెనుక ఉన్న విడదల రజిని సైతం వైసీపీలోకి వెళ్ళి, ప్రత్తిపాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శల ఫలితంగానే చిలకలూరిపేట సీటు దక్కించుకున్నారు…అలాగే ప్రత్తిపాటిపై గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యారని చెప్పొచ్చు. అసలు ప్రత్తిపాటిపై రజిని గెలుస్తారని ఎవరు ఊహించలేదు..కానీ రజిని గత ఎన్నికల్లో సత్తా చాటారు. ఎమ్మెల్యే అయ్యాక రజిని తన క్రేజ్ ఎలా పెంచుకున్నారో చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది.

అయితే రజినిపై పలురకాల విమర్శలు కూడా వచ్చాయి..పెయిడ్ ఆర్టిస్టులతో ప్రచారం చేయించుకుంటారని, ఏ పనిచేసిన హంగు ఆర్భాటం చేస్తారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఇక ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో రజిని కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, జనంలో ఉండరనే టాక్ మొదలైంది. కానీ రజినిపై ప్రత్తిపాటి డైరక్ట్‌గా ఎటాక్ ఎప్పుడు చేయలేదు.

తాజాగా మాత్రం యడవల్లి దళితులను రజిని మోసం చేశారని, చిలకలూరిపేట రేషన్ మాఫియాకు అడ్డాగా మారిందని, అలాగే రోజుకు 10 లారీల తెలంగాణ మద్యం చిలకలూరిపేట వస్తుందని ఆరోపణలు గుప్పించారు. అయితే గతంలో తనపై చేసిన ఆరోపణలకు రివర్స్‌లో ప్రత్తిపాటి కౌంటర్లు ఇచ్చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ ఆరోపణలు రజినికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి…అటు ఎలాగో సొంత పార్టీలో కూడా రజినిపై అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ పరిస్తితులని బట్టి చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో రజినికి ప్రత్తిపాటి చెక్ పెట్టేలా ఉన్నారు.

Discussion about this post