గత కొన్ని రోజులుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ నరసాపురం బరిలో నిలబడి వైసీపీని ఓడిస్తానని రఘురామకృష్ణంరాజు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈలోపు తనపై వేటు వేయించుకునే దమ్ముంటే..వేటు వేయించుకోవచ్చని వైసీపీ వాళ్ళకు ఫిబ్రవరి 5 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత తనంతట తానే రాజీనామా చేసేస్తానని చెప్పారు. అలాగే కరెక్ట్ పార్టీలో చేరి, వైసీపీ వ్యతిరేక పార్టీల మద్ధతు తీసుకుని మళ్ళీ నరసాపురం బరిలో దిగుతానని చెప్పారు.

అయితే రాజు గారు ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పటివరకు పెద్దగా క్లారిటీ రాలేదు. కానీ తాజాగా ఆయన మాటల బట్టి చూస్తే…బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయిందని తెలుస్తోంది. బీజేపీకు జగన్ రహస్య మిత్రుడు అని చెప్పి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు అని, ఇప్పుడు బీజీపీ మారిపోయింది..ఇకపై జగన్‌పై యుద్ధం చేస్తారని, తనకు బీజేపీ అధిష్టానంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పి తాజాగా రఘురామ ఓ న్యూస్ చానల్‌లో చెప్పుకొచ్చారు.

అందుకే ఏపీలో బీజేపీ సైతం జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయడం మొదలుపెట్టిందని చెబుతున్నారు. అవును ఇది మాత్రం నిజమే..ఇంతకాలం సైలెంట్‌గా జగన్‌కు సపోర్ట్‌గా నడుచుకున్నట్లు కనిపించిన కొందరు బీజేపీ నేతలు..ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. రోడ్లు ఎక్కి హడావిడి చేస్తున్నారు. అంటే జగన్‌కు బీజేపీతో ఉన్న సంబంధాలు తెగిపోయాయని రాజు గారు చెబుతున్నారు.

ఇదే క్రమంలో ఆయన పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం లాంఛనమే అని తెలుస్తోంది. ఎలాగో బీజేపీతో జనసేన పొత్తు ఉంది..ఇక బీజేపీ అభ్యర్ధిగా ఆయన నరసాపురంలో పోటీ చేస్తారు. అప్పుడు చంద్రబాబు సపోర్ట్ కూడా తీసుకోవాలి..లేదంటే గెలవడం కష్టం. కానీ రాజు గారు బీజేపీలో చేరితే సపోర్ట్ ఇవ్వొద్దని తమ్ముళ్ళు అంటున్నారు. కానీ బాబు మాత్రం సపోర్ట్ ఇచ్చేలా ఉన్నారు. చూడాలి మరి రాజు గారి రాజకీయం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో.

Discussion about this post