గతంలో మాదిరిగా చంద్రబాబు మొహమాటం పడటం లేదు..సరిగ్గా పనిచేయకపోతే వారికి డౌటే లేకుండా సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు నేతలకు క్లాస్ ఇచ్చారు. పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు. అయినా సరే కొందరు నేతల్లో మార్పు రాలేదు. దీంతో కొందరు నేతలకు సీట్లు ఇవ్వడానికి బాబు రెడీగా లేరు. ఇదే సమయంలో ఆ మధ్య రాజానగరం పెందుర్తి వెంకటేష్‌కు బాబు క్లాస్ ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన అలిగి ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇక రాజానగరం సీటు ఖాళీగా ఉండిపోయింది. అయితే 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన పెందుర్తి..2019 ఎన్నికల్లో 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ తేడాతో ఓడిపోవడానికి పెందుర్తిపై ఉన్న వ్యతిరేకత కారణం..అలాగే ఓడిపోయాక కొన్ని రోజులు యాక్టివ్ గా లేరు. తర్వాత కాస్త యాక్టివ్ అవుతూ వచ్చారు. అయినా సరే రాజానగరంలో పార్టీని బలోపేతం చేయలేకపోయారు.

ఈ క్రమంలో కార్యకర్తల మీటింగ్ లో బాబు..డైరక్ట్ గా పెందుర్తికి క్లాస్ ఇచ్చారు. దీంతో పెందుర్తి అలిగేసి ఇంచార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి అక్కడ టిడిపికి ఇంచార్జ్ లేరు. దీంతో టిడిపిలో కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి. బాబు కూడా కొత్త ఇంచార్జ్ ని పెట్టలేదు. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే రాజా కాస్త స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాగే జనసేనకు బలం ఉంది.
దీంతో పొత్తు ఉంటే జనసేనకు రాజానగరం సీటు ఇవ్వాలని బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ ఇంచార్జ్ ని పెడుతున్నట్లు కనిపిస్తుంది. లేదంటే కొత్త అభ్యర్ధిని బరిలో దింపాలి. చూడాలి మరి బాబు..రాజానగరంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో.