శ్రీకాకుళం జిల్లాలో పూర్తి ఆధిక్యంలో ఉన్న వైసీపీకి…పార్లమెంట్ స్థాయిలో మాత్రం సరైన నాయకుడు దొరకడం లేదు. అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ నేతలకు బలమైన నాయకులు ఉన్నారు గానీ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో సరైన నాయకులు లేరు. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతుంది. అందులోనూ రామ్మోహన్ నాయుడు ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ…శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే మూడోసారి కూడా రామ్మోహన్‌కు తిరుగులేదని అర్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ శ్రీకాకుళంలో వైసీపీకి బలమైన నాయకుడు దొరకలేదు. రామ్మోహన్‌ని ఢీకొట్టే సత్తా గల నాయకుడు వైసీపీలో కనిపించడం లేదు. గత రెండు పర్యాయాలు అభ్యర్ధులని మార్చిన సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. 2014లో రామ్మోహన్‌పై రెడ్డి శాంతి పోటీ చేసి ఓడిపోయారు..2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో రామ్మోహన్‌పై ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

రెడ్డి శాంతి ఇప్పుడు పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు దువ్వాడ ఏమో…టెక్కలి అసెంబ్లీ బాధ్యతలు చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో దువ్వాడ…టెక్కలి బరిలోనే దిగనున్నారు. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో ఎవరిని నిలబెడతారో చూడాలి. 2019 ఎన్నికల్లో టెక్కలిలో పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్…పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. ఆయనకు ఎలాగో నెక్స్ట్ టెక్కలి సీటు వచ్చే అవకాశం లేదు.

అలాంటప్పుడు ఆయన్ని పార్లమెంట్ బరిలో దింపే ఛాన్స్ ఉంది. అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సైతం…పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన ఈమె..శ్రీకాకుళం ఎంపీ సీటు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఈమె…కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు వైసీపీ తరుపున బరిలో దిగేందుకు చూస్తున్నారు. మరి చూడాలి తిలక్, కృపారాణిల్లో జగన్ ఎవరిని రామ్మోహన్‌పై పోటీకి దింపుతారో చూడాలి.

Discussion about this post