May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

రామచంద్రాపురంలో సైకిల్ వెనుకడుగు..జనసేనకు వదిలేస్తారా?

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వైసీపీకి ధీటుగా బలపడింది గాని..వైసీపీనిఓ గద్దె దింపి..టి‌డి‌పి అధికారంలోకి రావాలంటే…ఇంకా పలు స్థానాల్లో పికప్ అవ్వాలి. అయితే కొన్ని స్థానాల్లో టి‌డి‌పి వెనుకబడి ఉంది. ఆయా స్థానాల్లో టి‌డి‌పి పరిస్తితి ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గంలో టి‌డి‌పి పరిస్తితి దారుణంగా ఉంది.

వాస్తవానికి ఇక్కడ టి‌డి‌పికి బలమైన క్యాడర్ ఉంది..అలాగే నాలుగుసార్లు గెలిచింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక..అక్కడ టి‌డి‌పి పరిస్తితి దారుణంగా తయారైంది. అప్పటివరకు టి‌డి‌పిలో పనిచేస్తూ వచ్చిన తోట త్రిమూర్తులు 2019లో ఓడిపోయాక..టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వెళ్లిపోయారు. అలా తోట వెళ్లిపోవడంతో అక్కడ టి‌డి‌పికి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఇక తోట మండపేట వైసీపీ ఇంచార్జ్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇటు రామచంద్రాపురం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నిజానికి అక్కడ చెల్లుబోయినకి పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ బలంగా ఉన్న తోట వర్గం చెల్లుబోయినకు సహకరించేలా లేదు. దీంతో టి‌డి‌పికి అడ్వాంటేజ్ ఉంటుంది. సరైన నాయకుడు లేకపోవడం టి‌డి‌పికి బ్యాడ్ లక్. రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంచార్జ్ గా ఉన్నా సరే ఉపయోగం లేదు.

అయితే ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు 20 వేల ఓట్ల వరకు పడ్డాయి. ఇక చెల్లుబోయిన టి‌డి‌పిపై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంటే టి‌డిపి-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీకి చెక్ పడటం ఖాయమే. ఇక పొత్తు ఫిక్స్ అయితే ఈ సీటుని జనసేనకు వదిలేసే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి రామచంద్రాపురం ఎవరికి దక్కుతుందో.