May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

రాపాకకు రివర్స్..లాజిక్ లేని స్క్రిప్ట్..రాజోలులో ఓటమి అంచుకు!

వరుస ఓటములతో అధికార వైసీపీలో కల్లోలం మొదలైన విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ ఓడిపోయింది. టి‌డి‌పి అనూహ్యంగా గెలిచింది. అయితే నాలుగు స్థానాల్లో ఓడినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏంటి అని అనుకోవచ్చు..ఇక్కడే లాజిక్ ఉంది. ఇంతకాలం అధికార బలం ప్రజలని పథకాలు పోతాయని భయపెట్టి దాదాపు అన్నీ ఎన్నికల్లో గెలిచేశారు. అలాంటి గెలుపుకు పట్టభద్రులు బ్రేకులు వేశారు. మూడు ప్రాంతాల్లో వైసీపీపై వ్యతిరేకత మొదలైందని చూపించారు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం వ్యతిరేకంగా ఉన్నారని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి.

ఈ ఓటములు వైసీపీకి భారీ దెబ్బ అని గట్టిగా చెప్పవచ్చు. అందుకే ఈ ఓటములని కవర్ చేసుకోవడానికి ఓ స్క్రిప్ట్ తో ముందుకొచ్చింది..అది ఏంటంటే..వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలని చంద్రబాబు డబ్బులు పెట్టి కొన్నారని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన రాపాక వరప్రసాద్ తో సైతం ఒక స్క్రిప్ట్ నడిపిస్తున్నారు. కానీ అక్కడ వైసీపీ స్క్రిప్ట్ కు ఏ మాత్రం లాజిక్ లు లేవు.

ఎందుకంటే ఎవరైనా అధికార పార్టీలో ఉంటే ఎక్కువ సంపాదిస్తారనే ఆరోపణలు ఉంటాయి. అలాంటిది అధికార పార్టీని వదిలి 10 కోట్ల కోసం ఎమ్మెల్యేలు రావడం అనేది కరెక్ట్ గా లేదు. ఈ సమయంలో ఒక ఎమ్మెల్సీ కోసం బాబు అన్నీ కోట్లు పెట్టడం కష్టమే. పైగా టి‌డి‌పికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ లాక్కుంది. మరి వారికి ఎంత ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ  స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోవడం, రివర్స్ అవ్వడంతో రాపాకని దించారు.

ఈయన ఏం అంటారంటే క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు టి‌డి‌పి 10 కోట్ల ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు. అసలు వైసీపీలోనే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు..అయినా టి‌డి‌పి అసలు బలం 23..అలాంటప్పుడు టి‌డి‌పికి ఏం అవసరం. ఇంకా రాపాక జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళి ఎంత తీసుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా రాపాక స్క్రిప్ట్ రివర్స్ అయింది..ఈ దెబ్బతో రాజోలులో రాపాక మరింత దారుణంగా ఓటమి అంచుకు వెళ్లారని తెలుస్తోంది.