అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ రెండు నియోజకవర్గాల్లో వైసీపీతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఓ వైపు ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పరిటాల శ్రీరామ్ పనిచేస్తున్నారు. మరోవైపు రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ధీటుగా పనిచేయాల్సి ఉంది. ఇలా రెండు నియోజకవర్గాల బాధ్యతలని శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే శ్రీరామ్‌కు ఏ సీటు దొరుకుంటుందనేది క్లారిటీ లేదు.

వాస్తవానికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు…అయితే రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్‌లు పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇటీవల బీజేపీ నేతగా ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ..మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటులో పోటీ చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు…ధర్మవరం సీటు తమదే అని ప్రకటించేసుకుంటున్నారు..కానీ ఎవరు ఎన్ని చెప్పిన ధర్మవరం సీటు మాత్రం తమదే అని శ్రీరామ్ అంటున్నారు.

అయితే ఇంతవరకు ధర్మవరం సీటుపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ధర్మవరం సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అదే సమయంలో ధర్మవరంలో శ్రీరామ్ దూకుడుగా పనిచేస్తున్నారు….ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అటు బీజేపీ నేత సూరి కూడా దూకుడుగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ధర్మవరంలో వార్ నడుస్తోంది. ఇటు రాప్తాడులో ప్రకాష్‌ని టార్గెట్ చేసుకుని శ్రీరామ్ ఫైర్ అవుతున్నారు..ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అటు నుంచి ఎమ్మెల్యే ప్రకాష్ సైతం శ్రీరామ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు..పైగా తనపై రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారో చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు. అంటే ధర్మవరం సీటు విషయంలో క్లారిటీ రాకపోవడంతో రాప్తాడులో ఎవరు బరిలో దిగుతారో క్లారిటీ లేదు. అందుకే ప్రకాష్ ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దీనికి శ్రీరామ్ త్వరగా చెక్ పెట్టాలి..త్వరగా చంద్రబాబు ద్వారా సీటు కన్ఫామ్ చేసుకోవాలి. మరి చూడాలి చివరికి రాప్తాడు బరిలో శ్రీరామ్ ఉంటారో…సునీతమ్మ ఉంటారో.

Discussion about this post