ఇటీవల టీడీపీలో సీట్ల కోసం పోటీ ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే..అసలు ఎన్నికలకు ఇంకా రెండేళ్లపైనే సమయం ఉండగానే చంద్రబాబు..ఇప్పటినుంచే నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు..ఇప్పటికే పలు చోట్ల అభ్యర్ధులని ఫిక్స్ చేశారు…ఇంకా కొన్ని చోట్ల నాయకులని పెట్టాలసిన అవసరం ఉంది..ఇదే సమయంలో కొన్ని చోట్ల సీటు కోసం పోటీ ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ సీట్ల కోసం పోటీ పెరిగింది. వైసీపీ హవా ఉన్న కడపలో టీడీపీ సీట్ల కోసం డిమాండ్ పెరిగిందంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఎందుకంటే కడపలో సైతం టీడీపీ పుంజుకునే పరిస్తితి కనిపిస్తోంది….ఇదే క్రమంలో రాయచోటి అసెంబ్లీ సీటు విషయంలో పోటీ బాగానే ఉంది. ఎందుకంటే ఈ సారి రాయచోటిలో టీడీపీకి అనుకూల పరిస్తితులు కనిపిస్తున్నాయి…2009 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న శ్రీకాంత్ రెడ్డి వల్ల పెద్దగా ఒరిగింది ఏమి లేదని ప్రజలు భావిస్తున్నారు…ఈ సారి రాయచోటి ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

అందుకే ఇక్కడ టీడీపీకి ఊపు కనిపిస్తోంది..ఇక ఈ సీటు కోసం మొత్తం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు..రమేష్ కుమార్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు…ఈ ముగ్గురు ఇప్పుడు రాయచోటి టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు..ఈ ముగ్గురు నేతలు బలమైన నేతలే..వీరికి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది..రమేష్…గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేత, మళ్ళీ ఈయన ఇంకోసారి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

అటు సుగవాసి తండ్రి పాలకొండ్రాయుడు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు…ఇప్పుడు ఆయన వారసుడుగా ప్రసాద్ బాబు సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు ఇచ్చిన మండిపల్లి ఇప్పుడు వైసీపీకి దూరం జరిగి…టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. మరి వీరిలో ఎవరికి రాయచోటి సైకిల్ పగ్గాలు దక్కుతాయో చూడాలి.


Discussion about this post