ఇటీవల ఏపీ రాజకీయాల్లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఐపీఎల్ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న రాయుడు..జగన్కు భజన చేసే పనిలో పడ్డారు. ఆ మధ్యే విశాఖలో జగన్ స్పీచ్ అద్భుతంగా ఉందని పొగిడారు. ఇక ఐపీఎల్ కప్ తీసుకుని ఈ మధ్య జగన్ని కలిశారు. తాజాగా వైసీపీ అనుకూల మీడియాలో ఇంటర్యూ ఇస్తూ..జగన్ పాలన సూపర్ అని పొగిడారు.

దీంతో రాయుడు వైసీపీలోకి వస్తున్నారని తెలిసిపోతుంది. అదే సమయంలో అభివృధ్ది అంటే ఒక ఐటీ కంపెనీ తేవడం కాదని, ఉదాహరణకు జగన్ బందరు పోర్టు కడుతున్నారని, అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, డెల్టా ప్రాంతం బంగారం చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఇక్కడ పరోక్షంగా చంద్రబాబుని విమర్శించారు. అసలు బందరు పోర్టు కట్టేస్తున్నారని ఉదాహరణకు చెప్పారు. అక్కడ జరిగేది పెద్దగా లేదు. ఏదో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు తప్ప వాటిని పూర్తి చేసేది లేదు. కానీ అన్నీ తెలిసిన రాయుడు కూడా జగన్ భజన చేస్తున్నారు. అంటే సీటు కోసమే రాయుడుకు ఈ తిప్పలు అని తెలుస్తుంది.
ఇక బందరు అని చెప్పడం ద్వారా..ఆయన బందరు ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం వస్తుంది. లేదా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. రెండుచోట్లలో ఎక్కడ పోటీ చేసిన రాయుడు గెలవడం కష్టమే. ఎందుకంటే టిడిపి, జనసేన పొత్తు ఉంది..పొత్తు ప్రభావం రెండు సీట్లలో ఎక్కువే. కాబట్టి రాయుడుకు పోలిటికల్ అరంగ్రేటమే ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.