తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు విజయం సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా రేపల్లెలో టిడిపి జెండా ఎగిరింది. టిడిపి నుంచి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల ఈయన ఎక్కువ పనులు చేయలేకపోతున్నరు.
ఇక అధికార బలంతో ఈ స్థానంపై గ్రిప్ సాధించాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో పంచాయితీ, పరిషత్, రేపల్లె మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే అధికార బలంతోనే అక్కడ వైసీపీ విజయం సాదించిందని చెప్పవచ్చు. ఇక ఇక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉంటుందనేది చూస్తే..రేపల్లెలో వైసీపీ-టిడిపిలు పోటాపోటీగానే ఉన్నాయి. ఇక వైసీపీ నుంచి వరుసగా మోపిదేవి వెంకటరమణ ఓడిపోతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. దాదాపు మోపిదేవి వారసుడు వైసీపీ నుంచి రేపల్లె బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం రేపల్లెలో వైసీపీ కార్యక్రమాలు ఆయనే చూసుకుంటున్నారు. అయితే టిడిపి ఎమ్మెల్యే అనగానికి బలం ఏమి తక్కువ కాదు. ఆయనకు సొంత ఫాలోయింగ్ ఉంది. టిడిపి అధికారంలో ఉండగా రేపల్లెలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేదుల. పైగా పక్కనే ఉన్న రాజధాని అమరావతిని పట్టించుకోవడం లేదు.

కాబట్టి ఈ పరిణామాలు వైసీపీకి ఇబ్బందే. నెక్స్ట్ ఎన్నికల్లో కొద్దో గొప్పో టిడిపికి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆర్ధికంగా వైసీపీ వెనుకడుగు వేసేలా లేదు..కాబట్టి రేపల్లెలో ఈ సారి టఫ్ ఫైట్ జరిగేలా ఉంది.