గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో రేపల్లె కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలిచింది. 1983, 1985లో యడ్ల వెంకట్రావు గెలవగా, 1994, 1999 ఎన్నికల్లో ముమ్మనేని వెంకట సుబ్బయ్య గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. ఇలా ఆరుసార్లు టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ సారి ఎన్నికల్లో మాత్రం టీడీపీకి కాస్త గెలుపు దూరమయ్యేలా కనిపిస్తోంది.

అదేంటి రాష్ట్రంలో ఇప్పుడుప్పుడే టీడీపీ పికప్ అవుతుంది కదా…మరి రేపల్లెలో రివర్స్ ఎందుకు అవుతుందనే డౌట్ రావొచ్చు. దీనికి కారణాలు లేకపోలేదు. అసలు జగన్ గాలిలో సైతం టీడీపీ నుంచి అనగాని విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే పరిస్తితి. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న అనగాని అనుకున్న మేర ప్రజలకు అందుబాటులో ఉండటంలో గానీ, వారికి పనులు చేసి పెట్టడంలో గానీ విఫలమైనట్లే కనిపిస్తున్నారు.

అనగాని సహచరులుగా ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వారు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. వారికి అండగా ఉంటున్నారు. అందుకే వారి బలం ఇంకా తగ్గలేదు. కానీ అనగాని అలా కాదు…ఈయన ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.



ఈ రెండున్నర ఏళ్లలో ప్రజల మధ్యలో ఉన్నది తక్కువ..అప్పుడప్పుడు మీడియా ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తున్నారు. పైగా రేపల్లెలో వైసీపీ స్ట్రాంగ్ అవుతుంది. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సోదరుడు రేపల్లెలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇటీవల పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయాలు దక్కేలా చేశారు. అసలు టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేని పరిస్తితికి వచ్చింది. ఇక ఇదే పరిస్తితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే రేపల్లె టీడీపీ చేతుల్లో నుంచి చేజారడం ఖాయం.

Discussion about this post