గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి..జనసేన వల్ల చాలా నష్టం జరిగిన విషయం తెలిసిందే. జనసేన భారీగా ఓట్లు చీల్చి వైసీపీకి లాభం జరిగేలా చేసింది..ఇటు టిడిపికి నష్టం జరిగింది. అలా జనసేన వల్ల టిడిపికి దెబ్బపడిన ప్రాంతాల్లో కాకినాడ పార్లమెంట్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో కేవలం జనసేన వల్ల టిడిపి నష్టపోయింది. కాకినాడ ఎంపీ సీటుని టిడిపి 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది..అక్కడ జనసేనకు లక్షా 32 వేల ఓట్లు పడ్డాయి.
అంటే అప్పుడు టిడిపి-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచేది కాదు. ఇక కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో టిడిపి కేవలం పెద్దాపురం సీటు మాత్రమే గెలిచింది..ఇక కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం,తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు సీట్లని వైసీపీ గెలుచుకుంది. అయితే వీటిల్లో ఒక్క తుని తప్ప..మిగిలిన సీట్లలో జనసేన ఓట్ల చీలిక ప్రభావం ఎక్కువ ఉంది. అంటే టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే ఆయా స్థానాల్లో జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. దాని వల్ల టిడిపికి డ్యామేజ్ జరిగింది.

అయితే ఇప్పుడు కాకినాడలో వైసీపీకి రివర్స్ అవుతుంది..వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇటు టిడిపి, జనసేన బలపడుతున్నాయి. కానీ ఇలా ఉన్నా సరే..ఇక్కడ టిడిపి-జనసేన వేరుగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీకే లాభం జరుగుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు. అలా కాకుండా టిడిపి-జనసేన గాని కలిసి పోటీ చేస్తే..కాకినాడ ఎంపీ సీటుతో పాటు..కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం సీట్లని గెలుచుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకే లాభం. చూడాలి మరి టిడిపి-జనసేన పొత్తు ఉంటుందో లేదో.