మాట తప్పను…మడమ తిప్పను ఇది జగన్ స్లోగన్…అయితే స్లోగన్ వినడానికి బాగుంది…కానీ ఆచరణలో పెట్టడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయనే చెప్పొచ్చు. ఏదో ఎన్నికల ముందు అంటే ఈ స్లోగన్ బాగా చెప్పి జగన్ జనంలోకి బాగా వెళ్లారు…కానీ ఎన్నికలై అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ స్లోగన్‌ని ఆచరణలో పెట్టడంలో ఫెయిల్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇక ఎన్ని విషయాల్లో మాట తప్పారు…మడమ తిప్పారో జనాలకే బాగా తెలుసు.

ఇక అందులో ఒక ఉదాహరణ మద్యపాన నిషేధం…అబ్బో సంపూర్ణ మద్యపాన నిషేధం అని మొదట్లో చెప్పారు..ఆ తర్వాత దశలవారి మద్యపాన నిషేధం అన్నారు…ఇది కూడా అస్సాం వెళ్లిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైతే మద్యం ఆదాయాన్ని షూరిటీగా పెట్టి అప్పు తెచ్చారో అప్పుడే మద్యపాన నిషేధంలో మాట తప్పారని అర్ధమైపోయింది.

ఇక ఈ అంశంలో జనాలకు జగన్‌పై నమ్మకం పోయింది. పైగా మద్యం రేట్లు దారుణంగా ఉండటం, నాసిరకం మద్యం అమ్మడం లాంటి అంశాలు ప్రభుత్వానికి బాగా నెగిటివ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కూడా జగన్ ప్రభుత్వంపై బాగా నెగిటివ్ ఉంది. మందుబాబులు ఫుల్ యాంటీగా ఉన్నారు. ఈ విషయం కూడా జగన్ ప్రభుత్వానికి అర్ధమవుతున్నట్లు ఉంది…అందుకే వరుసపెట్టి మద్యం ధరలని తగ్గించుకుంటూ వస్తుంది.

అలాగే త్వరలోనే పాత బ్రాండ్లుని సైతం తీసుకొస్తుందని తెలుస్తోంది. ఇప్పుడున్న బ్రాండ్లు నాసిరకం అని, ఇవి వైసీపీ నేతల సొంత బ్రాండ్లు అని అందరికీ తెలుసు. అయితే కొంతవరకు తమ బ్రాండ్లని అమ్ముకుని వైసీపీ నేతలు సొమ్ము చేసుకోవడంతో…ఇంకా రానున్న రోజుల్లో మంచి బ్రాండ్లు ఇచ్చి మందుబాబుల్లో వచ్చిన వ్యతిరేకతని పొగట్టాలని జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలుస్తోంది.
మళ్ళీ పాత బ్రాండ్లని తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు మందుబాబుల్లో అసంతృప్తి ఉండదని, నెక్స్ట్ ఎన్నికల నాటికి వారు సెట్ అయిపోతారని, మళ్ళీ వారు తమకు మద్ధతు ఇస్తారని వైసీపీ స్ట్రాటజీగా తెలుస్తోంది.

Discussion about this post