వచ్చే ఎన్నికల్లో టిడిపికి చెక్ పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ స్కెచ్ వేస్తున్న విషయం తెలిసిందే. పైగా టిడిపికి ఒక్క సీటు కూడా దక్కకుండా 175 సీట్లు వైసీపీ గెలవాలని చూస్తుంది. అయితే ఇదంతా జగన్ భ్రమే అని చెప్పాలి..ఎందుకంటే 175 కాదు కదా..గెలుపుకు కావల్సిన 88 సీట్లు కూడా వైసీపీకి దక్కేలా లేవు. అయితే జగన్ మాత్రం తన ప్రయత్నాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇక కీలకమైన టిడిపి నేతలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే టిడిపి కంచుకోటగా ఉన్న విశాఖ తూర్పుపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. విశాఖ రాజధాని పేరుతో అక్కడ వైసీపీ చేసే రాజకీయం ఏంటో తెలిసిందే. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. అక్కడ ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి వైసీపీ వేయని ఎత్తు లేదు. కానీ అన్నిటిని తట్టుకుని వెలగపూడి నిలబడ్డారు. ఇప్పటికీ గెలుపు అవకాశాలు ఆయన వైపే ఉన్నాయి.

2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలుపు దిశగా వెళుతున్నారు. ఇక ఆయన్ని ఆపాలని చూస్తున్న వైసీపీలోనే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ సీటు కోసం నలుగురు ప్రయత్నిస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ సమన్వయకర్త, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ గొలగాని హరివెంకటకుమారితోపాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీ పడుతున్నారు.
వీరు ఎవరికి వారు సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ ఎవరికి సీటు ఇచ్చిన..మరొకరు సహకరించే అవకాశం కనిపించడం లేదు. దీని వల్ల వైసీపీకే భారీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎన్ని చేసిన అక్కడ వెలగపూడి గెలుపుని ఆపడం కష్టమనే చెప్పాలి.