ఏదేమైనా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే రోజాకు ఫ్రస్టేషన్ పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజాకు ఇన్ని ఇబ్బందులు ఎదురు అవ్వలేదు…కానీ అధికారంలోకి వచ్చాక తలనొప్పులు పెరిగాయి..ఆమెని నగరి నుంచి సైడ్ చేయాలని సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆమెలో బాగా ఫ్రస్టేషన్ పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఫ్రస్టేషన్‌లో ఎడాపెడా మాట్లాడుతున్నట్లు ఉన్నారు.

అసలు చాలా కాలం నుంచి రోజాకు వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తున్న విషయం తెలిసిందే. కేజే కుమార్, శాంతి, రెడ్డివారి చక్రపాణిరెడ్డిలు ఓ గ్రూపుగా ఏర్పడి రోజాకు వ్యతిరేకంగా నగరిలో రాజకీయం నడుపుతున్నారు. ఇక వీరికి చెక్ పెట్టడానికి రోజా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వచ్చారు..కానీ కుదరలేదు. ఆ మధ్య స్థానిక ఎన్నికల్లో కూడా ఈ వర్గం రోజాకు చుక్కలు చూపించారు. ఇక తాజాగా కూడా రోజా వ్యతిరేక వర్గానికి పదవులు వచ్చాయి.

దీంతో వ్యతిరేక వర్గానికి పదవులు దక్కి, తన వర్గం వారికి పదవులు దక్కకపోవడంపై రోజా అసంతృప్తిగా ఉన్నారని, వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, కావాలనే తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని రోజా చెప్పుకొచ్చారు. ఇక సొంత పార్టీ నేతల నుంచే తలనొప్పి ఉందనుకుంటే…ఇటీవల ప్రత్యర్ధి పార్టీ టీడీపీ నుంచి కూడా ఎటాక్ మొదలైంది…టీడీపీ నేత గాలి భాను…రోజా టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎమ్మెల్యే రోజాకు కోట్ల ఆస్తులు పెరిగాయని, ప్రజలకు ఏమో అప్పులు పెరిగాయని, అలాగే కొందరు వైసీపీ నేతలు రోజా అండతో ఆంబోతులు మాదిరిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అయితే తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తే మూతి పగలగొడతానని, తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలని రోజా కౌంటర్ ఇచ్చారు. అయితే రోజా ఫ్రస్టేషన్ పెరిగి మాట్లాడుతున్నారని, దోచుకున్నవారు ఎవరైనా సొంత ఎకౌంట్‌ల్లో డబ్బులు దాచుకుంటారా? అంత అమాయకులు ఎవరు లేరని టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. మొత్తానికి అటు సొంత పార్టీ, ఇటు టీడీపీ కామెంట్లతో రోజాకు నగరిలో తలనొప్పి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Discussion about this post