రాజకీయాల్లో ఎవరికైనా అధికారంలో ఉన్నప్పుడే మెరుగైన పరిస్తితి ఉంటుంది..రాజకీయంగా మంచి పొజిషన్ ఉంటుంది…కానీ వైసీపీ ఎమ్మెల్యే రోజా పరిస్తితి…అధికారంలోకి వచ్చినప్పుడు కంటే…ప్రతిపక్షంలోనే బాగుందని చెప్పొచ్చు…ఆమె ప్రతిపక్షంలో ఉండగా చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు..అలాగే ఆమె దూకుడుగా రాజకీయం చేసేవారు. అలా చేయడం వల్లే రెండోసారి కూడా ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సత్తా చాటిన రోజా..అధికారంలోకి వచ్చాక ఇంకా వెనక్కి తగ్గరని అంతా అనుకున్నారు.

కానీ మొత్తం రివర్స్ అయింది…అనుకున్న విధంగా మంత్రి పదవి రాలేదు…అలాగే ఇచ్చిన ఏపిఐఐసి ఛైర్మన్ పదవి మధ్యలోనే పోయింది…ఇక చివరికి ఎమ్మెల్యే పదవీకే ఎసరు వచ్చింది. నగరిలో సొంత పార్టీ వాళ్లే రోజాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే..చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ మంత్రి సపోర్ట్‌తో రోజా వ్యతిరేక వర్గం నగరిలో రాజకీయం చేస్తుంది..బహిరంగంగానే రోజాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చెస్తున్నారు.

అసలు నగరిలో రెండుసార్లు రోజా గెలవడానికి తామే కారణమని, అలాంటిది తమని రోజా పట్టించుకోలేదని, అందుకే సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నామని వ్యతిరేక వర్గం చెబుతుంది…అలాగే నెక్స్ట్ రోజాకు సీటు ఎలా వస్తుందో కూడా చూస్తామని అంటున్నారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో రోజా..సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరారు..మరి నగరిలో ఉండే పరిస్తితులని చెప్పడం కాకుండా…మంత్రి పదవి కోసం రోజా మాట్లాడేలా ఉన్నారు. అదే సమయంలో జిల్లాల విభజనలో భాగంగా నగరిని బాలాజీ జిల్లాలో చేర్చాలని డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్‌పై కూడా రోజా, జగన్‌తో మాట్లాడేలా ఉన్నారు.

మొదట తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టడమే రోజా ముందున్న తక్షణ కర్తవ్యం…మరి ఈ విషయంలో జగన్…రోజాకు ఏ మేర సపోర్ట్ ఇస్తారో చూడాలి. జగన్ కూడా విని వదిలేస్తే నగరిలో రోజా పరిస్తితి మరీ ఇబ్బందికరంగా తయారవుతుంది..ఒకవేళ ఆమెకు ఏదొరకంగా సీటు వచ్చిన సరే వ్యతిరేక వర్గం కారణంగా ఓడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు.

Discussion about this post