మెగా ఫ్యామిలీ ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజాకు తిరిగి మెగా ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఇంతకాలం ఆమెతో కలిసి పనిచేసిన జబర్దస్త్ నటులు సైతం రివర్స్ అయ్యే పరిస్తితి. మామూలుగానే రోజా ఫైర్ బ్రాండ్ నాయకురాలు..ఇక అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లపై నిత్యం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఘాటు పదజాలంతో విమర్శలు చేస్తారు.

అయితే వీరిపై రాజకీయ పరమైన విమర్శలు చేస్తే..వ్యక్తిగతంగా కూడా విమర్శలకు దిగుతారు. అలాగే తాజాగా చిరంజీవిని సైతం లాగి ఆయన ఓటమిపై కామెంట్ చేశారు. 2009లో చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక 2019లో పవన్ భీమవరంలో, నాగబాబు నర్సాపురంలో ఓడిపోయిన విషయాలని చెబుతూ..సొంత జిల్లా ప్రజలే మెగా ఫ్యామిలీని ఓడించారని, అలాగే మెగా ఫ్యామిలీ నలుగురికి సాయం చేయడం ఎప్పుడు చూడలేదంటూ విమర్శించారు.

రోజా ఇలా కామెంట్ చేయడంపై జబర్దస్త్ గెటప్ శ్రీను..రోజా టార్గెట్‌గా విరుచుకుపడ్డాడు. ‘చిరంజీవి గారి .. సేవా గుణం, దాన గుణం తెరిచిన పుస్తకం ..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో.. రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండంటూ అంటూ శ్రీను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక రోజాపై నాగబాబు కూడా ఫైర్ అయ్యారు..రోజాది నోరా మున్సిపాలిటీ కుప్ప తొట్టా అంటూ విరుచుకుపడ్డారు. ముందు వెనుకబడిన పర్యాటక రంగాన్ని బాగుచేయాలని సూచించారు. అయితే రోజాపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గతంలో రోజా కూడా రెండుసార్లు ఓడిపోయారని, రెండుసార్లు స్వల్ప మెజారిటీలతో గెలిచి బయటపడ్డారని, ఈ సారి నగరిలో గెలుస్తారో లేదో చూసుకోవాలని అంటున్నారు.

Leave feedback about this