రాజకీయాల్లో రోజాకు మొదట దురదృష్టం వెంటాడిన…తర్వాత మాత్రం అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి…కేవలం అదృష్టం మీద ఆధారపడే ఆమెకు విజయాలు వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిస్తే…2019 ఎన్నికల్లో 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు…అంటే ఇంత తక్కువ మెజారిటీలతో గెలవడం అదృష్టమే అనే చెప్పాలి. రెండుసార్లు కూడా అలాగే రోజా గెలిచి బయటపడ్డారు. కానీ ఈ సారి మాత్రం రోజాకు ఆ అదృష్టం దక్కేలా కనిపించడం లేదు.

ఆమెని సొంత పార్టీ నేతలే దెబ్బకొట్టేలా ఉన్నారు…ఇంతకాలం రోజాకు సొంత పార్టీ నేతలు సపోర్ట్ చేయడం వల్ల గెలుచుకుంటూ వచ్చేశారు. కానీ కొంతకాలం నుంచి సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగే పరిస్తితి వచ్చింది. ఆమెకు వ్యతిరేకంగా నగరిలో రాజకీయం చేస్తున్నారు..ఇప్పుడు అదే రోజాకు పెద్ద తలనొప్పిగా మారింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రోజాకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు పనిచేశారు. అప్పుడే ఆమె తెగ హడావిడి చేసేశారు…మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదులు చేసి, వైసీపీ అధిష్టానానికి చెప్పి ఎలాగోలా అప్పుడు తన మాట నేగ్గెలా చూసుకున్నారు.

కానీ రాను రాను నగరిలో అలాంటి పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు…ఇప్పటికే ఆమె వ్యతిరేక వర్గం పనులు చేయడం మొదలుపెట్టింది. పైగా తాజాగా రోజా వ్యతిరేక వర్గానికి పదవులు కూడా వచ్చాయి. నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి, మొదటి నుంచి రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రెడ్డివారి చక్రపాణిరెడ్డిని శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

ఈ దెబ్బతో రోజాపై రాజకీయంగా వ్యతిరేక వర్గం ఆధిపత్యం దక్కించుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే వారు రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో తమ సపోర్ట్ లేకుండా రోజా గెలిచి చూపించాలని సవాల్ చేస్తున్నారు. ఇటు రోజా సైతం వ్యతిరేక వర్గాన్ని సైడ్ చేయాలని చూస్తున్నారు. కానీ వారిని సైడ్ చేయడం అంత ఈజీ కాదనే చెప్పాలి. మొత్తానికి వ్యతిరేక వర్గంతో రోజాకు ఈ సారి గెలిచే అదృష్టం ఉండేలా లేదు.

Discussion about this post