రాజకీయాల్లో అధికార మార్పిడి జరగడం సహజమే. అధికారం మారగానే పాత ప్రభుత్వం అమలు చేసిన మంచి కార్యక్రమాలు కొత్త ప్రభుత్వం కొనసాగించాలి. కానీ ఏపీలో జగన్ మాత్రం ఆ పని చేయలేదు. చంద్రబాబు అమలు చేసిన మంచి కార్యక్రమాలకు జగన్ బ్రేక్ వేశారు. అలా చాలా వాటికి బ్రేక్ వేశారు. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో రైతులకు భారీగా ఇబ్బంది వచ్చింది. గతంలో రైతుల కష్టాలు తెలుసుకుని వారి రుణమాఫీ చేయాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.అలాగే అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు లక్షన్నర రుణమాఫీ చేస్తానని చెప్పి, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 50 వేలు ఉన్న రుణాలని ఒకేసారి మాఫీ చేశారు. ఇక లక్షన్నరని విడతల వారీగా మాఫీ చేస్తానని చెప్పరు.
అయితే బాబు ఎన్నికల ముందు వరకు రెండు, మూడు విడతల రుణమాఫీ చేసేశారు. కానీ ఎన్నికలయ్యాక అధికారంలోకి వచ్చిన జగన్ మిగిలిన రుణమాఫీని గాలికొదిలేశారు. దీంతో రైతులే ఆ అప్పు కట్టుకోవాల్సి వచ్చింది.పైగా రైతు భరోసా పేరిట జగన్ రైతులని మోస చేశారనే చెప్పొచ్చు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ. 12,500 ఇస్తానని చెప్పారు. అప్పటికి పిఎం కిసాన్ ప్రకటించలేదు. కానీ అధికారంలోకి వచ్చాక పిఎం కిసాన్ ద్వారా వచ్చే రూ. 6 వేలు కలుపుకుని జగన్ ప్రభుత్వం రైతులకు రూ. 13,500 ఇస్తుంది. అంటే జగన్ ప్రభుత్వం ఇచ్చేది రూ. 7,500 మాత్రమే. ముందుగా చెప్పిన మాట ప్రకారమైతే రూ. 12,500 ఇవ్వాలి. అంటే పిఎం కిసాన్ 6 వేలుతో కలిపి, మొత్తం రూ. 18,500 ఇవ్వాలి అలా ఇవ్వకుండా రైతులని జగన్ మోసం చేస్తున్నారు. పైగా 5 ఎకరాలు లోపు ఉన్నవారికే ఈ స్కీమ్ వస్తుంది.రాయలసీమ ప్రాంతాల్లో పది ఎకరాలుపై బడి ఉన్నా సరే పెద్దగా రైతులకు ప్రయోజనం ఉండదు. అలాంటివారి కోసం గత చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 10 వేలు ఇస్తానని హామీ ఇచ్చింది. అలాగే 10 ఎకరాల్లోపు ఉన్నవారికి రూ. 9 వేలు ఇస్తామని అన్నారు. అంటే పిఎం కిసాన్‌తో కలుపుకుంటే రూ. 15 వేలు వస్తాయి. కానీ అప్పుడు ప్రజలు చంద్రబాబుని కాదని జగన్ హామీలు నమ్మి వైసీపీకి ఓటు వేసి మోసపోయారు.
పైగా పంట నష్టపోయినవారిని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం వెనుకబడి ఉంది. ఇప్పటికీ గత ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన రైతులకు సాయం అందలేదు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అటు ధాన్యం అమ్మిన డబ్బులు రెండు నెలలు దాటిన ఎకౌంట్‌ల్లో పడటం లేదు. ఎరువులు, పురుగుల మందుల ధరలు నియంత్రణలో లేవు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందో ఎవరికి తెలియదు. నియోజకవర్గానికో కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ ఉందో వైసీపీ నేతలకే తెలియాలి. ఏదేమైనా గానీ జగన్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలమైందనే చెప్పొచ్చు.
Discussion about this post