ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోట…తెలుగుదేశం పార్టీకి కంచుకోట..ఇక్కడ టిడిపి అద్భుతమైన విజయాలు సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తా చాటూతూనే ఉంది. 1983 నుంచి 1999 వరకు వరుసగా అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. కానీ 2004లో కాంగ్రెస్ హవా లో ఎస్ కోటలో టిడిపి ఓడిపోయింది. అయితే మళ్ళీ పుంజుకుని 2009, 2014 ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది.

ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో మళ్ళీ టిడిపి ఓడిపోయింది. వైసీపీ నుంచి కడుబండి శ్రీనివాసరావు గెలిచారు. వాస్తవానికి ఈయనది ఎస్ కోట సొంత స్థానం కాదు..కానీ జగన్ గాలిలో ఆయన గెలిచారు. అలా గాలిలో గెలిచిన శ్రీనివాసరావు..ఎస్ కోటలో పెద్దగా అందుబాటులో ఉండరు..ప్రజలు సమస్యలు పరిష్కరించడంలో వెనుకబడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి పెద్దగా లేదు. టిడిపి హయంలోనే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగింది. దీంతో అక్కడి ప్రజలు మనసు మారుతూ వస్తుంది. మళ్ళీ టిడిపి వైపు చూస్తున్నారు. టిడిపి తరుపున కోళ్ళ లలిత కుమారి పనిచేస్తున్నారు. ఈమె 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు.

అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన ఈమె..మొదట్లో కాస్త దూకుడుగా పనిచేయలేదు. కానీ తర్వాత చంద్రబాబు ఎక్కడకక్కడ నేతలని యాక్టివ్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే లలితకుమారి సైతం దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ టిడిపి ఆధిక్యంలోకి రావడం విశేషం.

ఇటీవల సర్వేల్లో ఎస్ కోటలో టిడిపి గెలుపు ఖాయమని తేలింది. అందులో ఎలాంటి డౌట్ లేదని తెలుస్తోంది. మరి వైసీపీ అభ్యర్ధిని మార్చి కొత్త వారిని బరిలో పెడుతుందా? అనేది చూడాలి. అయినా సరే ఎవరు బరిలో ఉన్న సరే ఎస్ కోటలో టిడిపి హవా ఖాయమే.
