ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి…రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్తితులు ఉన్నా సరే..ఆ సీట్లు సైకిల్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి..ఆ కంచుకోటల్లో టీడీపీ గెలుపు ఆపడం చాలా కష్టం. అయితే అలా టీడీపీకి గెలుపు ఖాయమనే నియోజకవర్గాల్లో శృంగవరపుకోట కూడా ఒకటి. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తూనే వస్తుంది. 1983 నుంచి 1999 వరకు ఇక్కడ పార్టీ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదు…కానీ 2004లోనే కాస్త వైఎస్సార్ వేవ్ టీడీపీని దెబ్బ తీసింది..దీంతో అప్పుడు అక్కడ కాంగ్రెస్ గెలిచింది.

మళ్ళీ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ హవా నడిచింది. అయితే కాస్త గట్టిగా ఫోకస్ చేసి ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గెలిచేది…కానీ అప్పటికే టీడీపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది..పైగా జగన్ గాలి ఎక్కువైంది..దీంతో ఎస్.కోటలో వైసీపీ గెలిచింది. అయితే మూడేళ్లలోనే సీన్ మారిపోయింది…ఎస్ కోట కాస్త మళ్ళీ టీడీపీ కంచుకోటగా మారిపోతూ వస్తుంది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మెరుగైన పనితీరు కనబర్చడంలో విఫలమవ్వడం టీడీపీకి బాగా కలిసొచ్చింది.

ఈ మూడేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. పైగా ఈయన ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించే కార్యక్రమాలు చేయడం తక్కువ. ఇక జగన్ చెప్పారని గడప గడపకు వెళుతున్నారు…గడప గడపకు వెళుతున్న కడుబండికి ప్రజల నుంచి నిరసనలు తప్ప నీరాజనాలు అందడం లేదు. ఇంతకాలం అందుబాటులో లేకుండా, పనులు చేయకుండా ఇప్పుడు గడప గడపకు తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది.

అంటే వైసీపీపై ఫుల్ నెగిటివ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇదే టీడీపీకి పెద్ద ప్లస్…పైగా టీడీపీ నాయకురాలు కోళ్ళ లలితకుమారి మళ్ళీ ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు…పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. దీంతో ఎస్ కోటలో లలితపై పాజిటివ్ పెరుగుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో కంచుకోట ఎస్.కోటలో సైకిల్ సవారీ జరగడం ఖాయమనే చెప్పొచ్చు.

Discussion about this post